లక్ష్మయ్య ఐఏఎస్ అకాడమీతో బీసీ సంక్షేమ శాఖ ఒప్పందం

పి4 మోడల్ లోచారిత్రక అవగాహన ఒప్పందం

hellotelugu-SSavitha

అమ‌రావ‌తి : ఏపీ బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్. స‌విత కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. రాష్ట్ర బీసీ స్టడీ చరిత్రలోనే కాదు దేశ చరిత్రలోనే నిలిచి పోయేలా P4 మోడల్ లో ఎంఓయు చేసుకుంటున్నాం అని తెలిపారు. సీఎం చంద్రబాబు ఆశయాలకు అనుగుణంగా.. P4లో ఒప్పందం చేసుకోవడం ఆనందంగా ఉందన్నారు. బీసీ స్టడీ సర్కిళ్ల ఆధ్వర్యంలో బీసీ నిరుద్యోగ యువతకు సివిల్స్ కోచింగ్ ఉచితంగా అందజేయడానికి దేశంలోనే ప్రఖ్యాతగాంచిన డాక్టర్ లక్ష్మయ్య ఐఎఎస్ అకాడమీతో బీసీ సంక్షేమ శాఖ ఒప్పందం చేసుకుంటోందని తెలిపారు. ఈ ఎంఓయు ఒప్పందం వల్ల సివిల్ సర్వీసెస్ కు ఎంపిక కావాలని కలలుగనే బీసీ యువతకు ఎంతో లబ్ధి కలుగుతోందని అన్నారు. బీసీ నిరుద్యోగ యువతకు డాక్టర్ లక్ష్మయ్య ఐఎఎస్ అకాడమీ నుంచి మెటీరియళ్ల ఉచితంగా అందజేస్తారని చెప్పారు. వివిధ సబ్జెక్టుల్లో నిష్ణాతులైన అధ్యాపకులు శిక్షణ అందజేయనున్నార‌ని తెలిపారు స‌విత‌.

ఈ ఒప్పందం వ‌ల్ల‌ బీసీ యువతకు ఎంతో మేలు కలుగ జేస్తుందనడంలో సందేహం లేద‌న్నారు. బీసీ యువతను కలెక్టర్లగా, ఎస్పీలుగా ఇతర ఉన్నత స్థానాల్లో నిలపాలన్నదే సీఎం చంద్రబాబు లక్ష్యం అన్నారు. అందుకోసమే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి బీసీ స్టడీ సర్కిల్ ద్వారా సివిల్ సర్వీసెస్ శిక్షణ అందజేస్తూ వస్తున్నాం అని చెప్పారు. రెండు విడతల్లో 200 మందికి ఉచిత సివిల్ సర్వీసెస్ శిక్షణ అందజేశామ‌న్నారు ఎస్. స‌విత‌. మొదటి బ్యాచ్ కు 2024-25లో ఎన్‌టీఆర్ జిల్లా విజయవాడ గొల్లపూడిలోని బి.సి. భవన్‌లో ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సివిల్ సర్వీసెస్ స్టడీ సర్కిల్ ద్వారా 100 మంది బి.సి., ఎస్.సి, ఎస్.టి. అభ్యర్థులకు సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ పరీక్షలకు ఉచిత శిక్షణ అందించడం జరిగిందన్నారు.

Exit mobile version