చంద్ర‌బాబుకు రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు

పాలనా సంస్కర్తకు ప్రతిష్ఠాత్మక పుర‌స్కారం

hellotelugu-APCM

అమరావతి : ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడుకు అరుదైన గౌర‌వం ల‌భించింది. అత్యంత‌ ప్రతిష్ఠాత్మక మీడియా సంస్థ ఎకనమిక్ టైమ్స్ ప్రకటించిన బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్ 2025 అవార్డకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎంపిక‌య్యారు. ఇవాళ ఆయ‌న ముంబైలో జ‌రిగే ప్ర‌ధానోత్స‌వ కార్య‌క్ర‌మంలో అందుకున్నారు. వెన్యూ అయిన జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్ కు చేరుకున్నారు. రాత్రి 9.30 వరకు ఎకనమిక్ టైమ్స్ నిర్వహించే అవార్డుల కార్యక్రమంలో పాల్గొన్నారు. రాత్రి 9.50 గంటలకు ముంబై నుంచి తిరుగు ప్రయాణం అవుతారు.

ఇదిలా ఉండ‌గా. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సహా దిగ్గజ పారిశ్రామిక దిగ్గజాల సమక్షంలో ఎకనమిక్ టైమ్స్ సంస్థ ఈ అవార్డు ను ముఖ్యమంత్రి అందుకోవ‌డం విశేషం. ఏపీలో స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ సహా స్పీడ్ ఆఫ్ డెలివరింగ్ గవర్నెన్సు లాంటి విప్లవాత్మక విధానాలు అమలుకు గాను ఎకనామిక్ టైమ్స్ ఈ అవార్డుకు సీఎం చంద్రబాబును ఎంపిక చేసింది. గతంలో అరుణ్ జైట్లీ, పీయూష్ గోయల్, నితీష్ కుమార్, అశ్వినీ వైష్ణవ్, జై శంకర్ తదితర ప్రముఖులకు బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు వరించింది.

రాష్ట్రంలో పెట్టుబడులకు అనుకూలమైన వాతావరణాన్ని కల్పించడం, పారిశ్రామిక విధానాల్లో విప్లవాత్మక మార్పులు-పారిశ్రామిక అనుకూల పాలసీలు తీసుకు రావడంలో చంద్రబాబు పోషిస్తున్న పాత్రను ఎకనమిక్ టైమ్స్ జ్యూరీ కొనియాడింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అతి తక్కువ సమయంలోనే ఏపీకి రూ.20 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులను రాష్ట్రానికి తీసుకు రావడంలో ముఖ్య పాత్ర పోషించార‌ని చంద్ర‌బాబును కొనియాడింది.

Exit mobile version