తిరుమల : దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది తిరుమలకు చెందిన శ్రీవారి ప్రసాదం లడ్డూ. ఏపీ కూటమి సర్కార్ కొలువు తీరిన తర్వాత కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. టీటీడీ చరిత్రలో రెండోసారి ఈవోగా ఛాన్స్ ఇచ్చారు సీఎం నారా చంద్రబాబు నాయుడు సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ అనిల్ కుమార్ సింఘాల్ కు. ఇదే సమయంలో శ్రీవారి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి చోటు చేసుకుందని ఆరోపణలు వచ్చాయి. సాక్షాత్తు సనాతన ధర్మ పరిరక్షణ కోసం గళం ఎత్తిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో పాటు సీఎం నారా చంద్రబాబు నాయుడు సైతం సంచలన ఆరోపణలు చేశారు.
ఇందుకు సంబంధించి సర్కార్ ఏకసభ్య కమిషన్ ను ఏర్పాటు చేసింది ఈ మొత్తం లడ్డూ కల్తీ నెయ్యి వ్యవహారంపై. కల్తీ నెయ్యి సరఫరాకు ప్రధాన కారకుడు టీటీడీ మాజీ ఈవో ధర్మారెడ్డి అంటూ బాంబు పేల్చింది. ప్రభుత్వానికి సమర్పించిన నివేదికలో సంచలన విషయాలు వెల్లడయ్యాయి. టెండరు నిబంధనలు సడలించడానికి అనుమతిచ్చింది ధర్మారెడ్డేనని ప్రభుత్వానికి ఏకసభ్య కమిషన్ నివేదిక ఇచ్చింది . ఆ నిర్ణయాల వల్లే టీటీడీలోకి కల్తీ నెయ్యి సరఫరా సంస్థల చొరబాటు జరిగిందని తేల్చింది. వాటిని బ్లాక్‌లిస్ట్‌లో పెట్టకుండా కొనసాగించారని ఆరోపించింది.అప్పటి ఈవో సింఘాల్, ఆర్థిక సలహాదారు బాలాజీల ప్రమేయంపైనా కమిషన్ నివేదికలో ప్రస్తావించింది .


















