RBI : దేశవ్యాప్తంగా ఆర్థిక వర్గాలను ఆశ్చర్యపరిచే విధంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) తన ద్రవ్య పరపతి విధాన (MPC) సమావేశంలో వరుసగా రెండోసారి రెపో రేటును తగ్గించకూడదని నిర్ణయించింది. ఆరుగురు సభ్యులలో ఐదుగురు కోతకు వ్యతిరేకంగా ఓటు వేసి ఈ నిర్ణయాన్ని ఖరారు చేశారు. ప్రస్తుతం రెపో రేటు 5.50 శాతం వద్ద కొనసాగుతోంది.
RBI Shocking Decision
ఆగస్టులో కూడా పాలసీ రేటును మార్చని ఆర్బీఐ, ఈసారి కనీసం 0.25 శాతం తగ్గింపు ఉంటుందని ఆర్థిక నిపుణులు ఊహించినా, అది జరగలేదు.
ఆర్బీఐ నిర్ణయం వెనుక కారణాలు
- ద్రవ్యోల్బణ ఒత్తిడి: పెరుగుతున్న ధరల ప్రభావం
- అంతర్జాతీయ సుంకాలు: వాణిజ్య వాతావరణం లోని అనిశ్చితి
- వృద్ధి మందగింపు: రేటు కోతలు చేసినా వృద్ధి ప్రయోజనాలు లేకపోవడం
నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఈ నిర్ణయం వ్యూహాత్మకమైంది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటికే RBI రెపో రేటును 1% వరకు తగ్గించింది. ఫిబ్రవరి, ఏప్రిల్‌లో తలా 25 బేసిస్ పాయింట్లు, జూన్‌లో 50 బేసిస్ పాయింట్లు కోత విధించింది. డిసెంబర్‌లో మరోసారి రేటు కోత వచ్చే అవకాశం ఉందని గవర్నర్ సంకేతాలిచ్చారు.
రెపో రేటు అంటే ఏమిటి?
ఆర్బీఐ వాణిజ్య బ్యాంకులకు రుణాలు ఇచ్చే రేటును రెపో రేటు అంటారు. ఇది పెరిగితే బ్యాంకులు ఎక్కువ వడ్డీతో రుణాలు తీసుకోవాల్సి వస్తుంది. ఫలితంగా, గృహ, వాహన, వ్యక్తిగత రుణాలపై వడ్డీ రేట్లు పెరుగుతాయి. ద్రవ్యోల్బణాన్ని నియంత్రించేందుకు ఆర్బీఐ లిక్విడిటీని తగ్గించడమే లక్ష్యం.
రివర్స్ రెపో రేటు
రిజర్వ్ బ్యాంక్ వాణిజ్య బ్యాంకుల నుండి నిధులను స్వీకరించే రేటును రివర్స్ రెపో రేటు అంటారు. ప్రస్తుతం ఇది 3.35 శాతం వద్ద కొనసాగుతోంది. ఈ రేటులో ఇటీవల ఎలాంటి మార్పులు జరగలేదు.
Also Read : Today Gold Price : రోజురోజుకు ఆకాశాన్నంటుతున్న పసిడి ధరలు
