RBI : మరణించిన బ్యాంకు కస్టమర్ల ఖాతాలు, లాకర్లకు సంబంధించిన క్లెయిమ్‌లను ఇకపై 15 రోజుల్లోగా పరిష్కరించి, నామినీలకు నిధులను బదిలీ చేయాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) తాజా మార్గదర్శకాలు జారీ చేసింది. ఆలస్యం జరిగితే నామినీకి పరిహారం చెల్లించడం తప్పనిసరి అవుతుందని ఆర్బీఐ స్పష్టం చేసింది. ఈ నిబంధనలు మార్చి 31, 2026 నుంచి అమల్లోకి రానున్నాయి.
RBI – నిబంధనలు వర్తించే విభాగాలు
- మరణించిన వ్యక్తి డిపాజిట్ ఖాతాలు
- సేఫ్ లాకర్లు
- బ్యాంకులో ఉంచిన ఇతర సేఫ్‌లు
ఖాతాలో నామినేషన్ లేదా సర్వైవర్‌షిప్ షరతు ఉంటే బ్యాంకు నామినీకి లేదా సర్వైవర్‌కు నిధులను బదిలీ చేస్తే తమ బాధ్యత ముగిసినట్లుగా పరిగణిస్తారు.
సరళీకృత విధానం:
- సహకార బ్యాంకుల్లో రూ.5 లక్షల వరకు
- ఇతర బ్యాంకుల్లో రూ.15 లక్షల వరకు
ఇలాంటి చిన్న మొత్తాల క్లెయిమ్‌లకు సరళ ప్రక్రియను అనుసరించాలి. ఎక్కువ మొత్తాల కోసం బ్యాంకు వారసత్వ ధృవీకరణ పత్రం లేదా లీగల్ డాక్యుమెంట్లు కోరవచ్చు.
లాకర్లు, సేఫ్‌లకు సంబంధించిన నియమాలు
- అవసరమైన పత్రాలు అందిన 15 రోజుల్లోపు క్లెయిమ్ పరిష్కారం
- హక్కుదారునితో సంప్రదించి లాకర్ జాబితా తేదీని షెడ్యూల్ చేయాలి
ఆలస్యమైతే జరగబోయే చర్యలు
డిపాజిట్ ఖాతాలు:
- 15 రోజుల్లో క్లెయిమ్ పరిష్కరించకపోతే కారణం వివరించాలి
- ఆలస్య కాలానికి బ్యాంకు వడ్డీ రేటు + 4% అదనపు వడ్డీ చెల్లించాలి
లాకర్లు/సేఫ్‌లు:
ఆలస్యమైతే ప్రతి రోజుకు రూ.5,000 పరిహారం చెల్లించాలి
ఆర్బీఐ లక్ష్యం
ఈ కొత్త నియమాల ద్వారా బ్యాంకింగ్ వ్యవస్థలో పారదర్శకత, వేగం పెంచడం, నామినీలకు అసౌకర్యం కలగకుండా సులభతర, విశ్వసనీయ క్లెయిమ్ ప్రాసెస్ అందించడమే ఆర్బీఐ ఉద్దేశం.
Also Read : Speed Post Shocking Update : స్పీడ్ పోస్ట్ డెలివరీలో కీలక మార్పులు చేసిన పోస్టల్ శాఖ



















