దుబాయ్ లీగ్ వేలానికి ర‌విచంద్ర‌న్ అశ్విన్

ఇప్ప‌టికే రిటైర్మెంట్ ప్ర‌క‌టించిన స్పిన్న‌ర్

hellotelugu-ravichandranashwin

చెన్నై : భార‌త స్టార్ స్పిన్న‌ర్ ర‌విచంద్ర‌న్ అశ్విన్ భార‌త దేశంలో నిర్వ‌హించే ఇండియ‌న్ ప్రిమీయ‌ర్ లీగ్ (ఐపీఎల్) వేలం పాట‌కు దూరం కానున్నాడు. ఎందుకంటే త‌ను ఇప్ప‌టికే క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్ర‌క‌టించాడు. అయితే విదేశాల‌లో ఆడేందుకు లైన్ క్లియ‌ర్ అయ్యింది త‌న‌కు. ఇందులో భాగంగా తాజాగా కీల‌క అప్ డేట్ వ‌చ్చింది త‌నకు సంబంధించి. ఇందులో భాగంగా యునైటెడ్ అర‌బ్ ఎమిరేట్స్ (యూఏఈ) లీగ్ వేలం పాట‌లో త‌ను కూడా పాలు పంచుకునేందుకు త‌న పేరు న‌మోదు చేసుకున్నాడు. కాగా భారత మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ వేలంలో అమ్ముడు పోలేదు. విచిత్రం ఏమిటంటే 120,000 ఆరు అంకెల బేస్ ధర ఉన్న ఏకైక ఆటగాడు అశ్విన్ కూడా యాక్సిలరేటెడ్ వేలంలో కనిపించ‌క పోవ‌డం ప్ర‌తి ఒక్క‌రిని ఆశ్చ‌ర్య పోయేలా చేసింది.

కానీ వైల్డ్‌కార్డ్ సంతకం ద్వారా ఇప్పటికీ కోట్‌లో చేరే ఛాన్స్ ఉంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ నుండి రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత అశ్విన్ యూఏఈ ఆధారిత లీగ్ కోసం నమోదు చేసుకున్నాడు. ఈ చర్య అతన్ని విదేశీ ఫ్రాంచైజీ పోటీలలో ఆడటానికి అర్హతను ఇచ్చింది. ఇదిలా ఉండ‌గా ఈ సీజన్ కోసం తనను తాను అందుబాటులో ఉంచుకున్నాడు 39 ఏళ్ల ర‌విచంద్ర‌న్ అశ్విన్. కాగా ఈ పోటీలో పాల్గొన్న మొదటి హై-ప్రొఫైల్ భారత క్రికెటర్ అయ్యాడు. నవంబర్‌లో జరిగే హాంకాంగ్ సిక్సెస్ టోర్నమెంట్‌లో అతను టీమ్ ఇండియాకు ప్రాతినిధ్యం వహించ బోతున్నాడు. ఛాంపియన్ ఆఫ్-స్పిన్నర్ గత సంవత్సరం భారతదేశం, ఆస్ట్రేలియా పర్యటన మధ్యలోనే బిగ్ షాక్ ఇచ్చాడు. తాను అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలుకుతున్న‌ట్లు వెల్ల‌డించాడు. దుబాయ్ క్యాపిటల్స్ మాజీ విదర్భ ఆఫ్-స్పిన్నర్ , రంజీ ట్రోఫీ విజేత అక్షయ్ వఖరే సేవలను పొందింది . మ‌రో వైపు ప్రస్తుతం అమెరికాకు ప్రాతినిధ్యం వహిస్తున్న అండర్-19 ప్రపంచ కప్ విజేత కెప్టెన్ ఉన్ముక్త్ చంద్‌ను అబుదాబి నైట్ రైడర్స్ కైవసం చేసుకుంది.

Exit mobile version