Raveena Tandon : బహు భాషల్లో నటించి తనకంటూ ఓ స్పెషల్ ఇమేజ్ స్వంతం చేసుకుంది రవీనా టాండన్ (Raveena Tandon). తను గతంలో తెలుగు, హిందీ భాషలలో నటించింది. ఆ తర్వాత కొంత కాలం గ్యాప్ ఇచ్చింది. తిరిగి ఎంట్రీ ఇచ్చింది. సినిమాలలో, వెబ్ సీరీస్ లలో బిజీగా మారింది. కేజీఎఫ్ 2లో దర్శకుడు ప్రశాంత్ నీల్ తనను తీసుకున్నాడు. అందులో నటించిన పాత్రకు మంచి పేరు వచ్చింది. ఇక రవీనా టాండన్ తన సినీ కెరీర్ ను మొదలు పెట్టి 24 ఏళ్లు పూర్తి చేసుకుంది ఈ ఏడాదితో. సూపర్ నేచురల్ థ్రిల్లర్ ఆధారంగా ఆక్స్ అనే సినిమాలో కీ రోల్ పోషించింది.
Raveena Tandon Comments
బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ తో కలిసి తెర పంచుకుంది రవీనా టాండన్. ఇందుకు సంబంధించి తాజాగా ఇన్ స్టా గ్రామ్ లో ఈ విషయాన్ని షేర్ చేసింది స్వయంగా. చీకటి ఇతివృత్తాలు, శైలీకృత కథలకు పేరుగాంచిన ఈ సినిమా తన వైవిధ్యమైన బాలీవుడ్ కెరీర్‌లో ఒక కల్ట్ క్లాసిక్‌గా మిగిలి పోయింది. ఆక్స్ చిత్రం తన సినీ కెరీర్ లో మరిచి పోలేని చిత్రంగా పేర్కొన్నారు నటి రవీనా టాండన్. ఈ సినిమా జూలై 13, 2001లో విడుదలైంది. విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ప్రేక్షకులు పెద్ద ఎత్తున ఆదరించారు చిత్రాన్ని.
ఈ సినిమా నుంచి ప్రత్యేకమైన రెండు ఫోటోలను షేర్ చేసుకోవడం ఆనందంగా ఉందన్నారు రవీనా టాండన్. ప్రస్తుతం తన ఫోటోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.
Also Read : Beauty Sydney Sweeney-James Bond : జేమ్స్ బాండ్ మూవీలో సిడ్నీ స్వీనీ



















