Rashmika : నాగ వంశీ ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కింగ్ డమ్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పాజిటివ్ టాక్ తో దూసుకు పోతోంది. మొదట్లో మిశ్రమ స్పందన వచ్చింది. ఆ తర్వాత జనం ఆదరించడం మొదలు పెట్టారు. ఈ సందర్భంగా షాకింగ్ కామెంట్స్ చేశారు నిర్మాత. నచ్చక పోతే తనకు ఫోన్ చేసి చెప్పాలన్నారు. తొలి రెండు రోజుల్లో రూ. 30 కోట్లకు పైగా వసూలు చేయడం ఆసక్తిని రేపింది. మరో వైపు సోషల్ మీడియాలో కొంత వ్యతిరేకంగా ప్రచారం చేసినా ఎక్కడా తగ్గలేదు విజయ్ దేవరకొండ. ఈసారి తన మూవీ తప్పకుండా ఆడుతుందని నమ్మకం వ్యక్తం చేశాడు. తనతో పాటు కూడా ధీమాగా ఉన్నారు నిర్మాత నాగవంశీ.
Rashmika Mandanna Seen Kingdom Movie
కింగ్ డమ్ చిత్రానికి జెర్సీ మూవీతో దుమ్ము రేపిన దర్శకుడు గౌతమ్ తిన్నసూరి దర్శకత్వం వహించాడు. ఈ మూవీ ఒక రకంగా డైనమిక్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ను తలపింప చేశాడన్న టాక్ వచ్చింది. ఇందులో విజయ్ దేవరకొండతో పాటు ముంబై భామ భాగ్యశ్రీ బోర్సే నటించారు. ఇదిలా ఉండగా తన ఫ్రెండ్ , డేటింగ్ లో ఉన్న నటించిన ఈ సినిమాను రహస్యంగా చూశారు నేషనల్ క్రష్ రష్మిక మందన్నా. ఈ విషయాన్ని తాను తర్వాత పంచుకున్నారు సోషల్ మీడియా వేదికగా. విజయ్ దేవరకొండ నటన అద్భుతంగా ఉందంటూ కితాబు ఇచ్చారు. తనను కొత్త ఫ్రేంలో చూపించాడని దర్శకుడిని ప్రశంసలతో ముంచెత్తింది ముద్దుగుమ్మ.
Also Read : Hero Balakrishna – Best Award : ఉత్తమ పురస్కారం చిత్ర బృందానికి అంకితం
