Balakrishna : కేంద్ర సర్కార్ 71వ జాతీయ చలనచిత్ర పురస్కారాలను ప్రకటించింది. తెలుగు కేటగిరిలో ఉత్తమ చిత్రంగా దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన శ్రీలీల, నందమూరి బాలకృష్ణ కలిసి నటించిన చిత్రం భగవంత్ కేసరి. ఎవరూ ఊహించని రీతిలో ఈ మూవీ బిగ్ సక్సెస్ అయ్యింది. రూ. 100 కోట్ల క్లబ్ లోకి చేరుకుంది. బాలకృష్ణ సినీ కెరీర్ లో అత్యధిక వసూళ్లు సాధించిన మూవీగా నిలిచింది. ఈ చిత్రంలో నటించడం తనకు మరింత సంతృప్తిని కలిగించిందని పేర్కొన్నారు . ఇదే సమయంలో బాలయ్యకు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకమైన పద్మభూషణ్ అవార్డును అందజేసింది.
Balakrishna Gets Best Award
ఈ క్రమంలో తను నటించిన చిత్రానికి ఉత్తమ కేటగిరీ కింద పురస్కారం లభించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. అవార్డు రావడంపై స్పందించారు. ఉత్తమ తెలుగు చిత్రంగా ఎంపిక కావడం నాకు అపారమైన గర్వ కారణమని పేర్కొన్నారు. ఈ గౌరవం మొత్తం తమమ చిత్ర బృందానికే చెందుతుందన్నారు. షైన్ స్క్రీన్స్ ఇండియా ఎల్ఎల్పీ సాహు గారపాటి , హరీష్ పెద్దితో పాటు ఈ కథను అద్భుతంగా తెరపై ఆవిష్కరించిన దర్శకుడు అనిల్ రావిపూడి ని ప్రత్యేకంగా అభినందిస్తున్నట్లు చెప్పారు బాలకృష్ణ.
అంతే కాకుండా అలాగే ప్రతి కళాకారుడు, సాంకేతిక నిపుణుడు, సిబ్బంది అందరి కృషి వల్లే ఈ విజయం సాధ్యమైందన్నారు. జాతీయ అవార్డుల జ్యూరీకి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియ చేశారు. భారతదేశంలోని ఇతర జాతీయ అవార్డు గ్రహీతలందరికీ అభినందనలు తెలియజేస్తున్నానని పేర్కొన్నారు బాలకృష్ణ. వారి ప్రతిభ భారతీయ సినీ రంగాన్ని మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్తుందన్నారు.
Also Read : Hero Balakrishna – Bhagavanth Kesari : ఉత్తమ తెలుగు చిత్రంగా భగవంత్ కేసరి
