Rashmika Mandanna : హైదరాబాద్ : నటుడు విజయ్ దేవరకొండ గురించి సంచలన ప్రకటన చేసింది నేషనల్ క్రష్. సోషల్ మీడియా వేదికగా ఈ విషయాన్ని వెల్లడించింది. తాను దేవరకొండను త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నటట్లు తెలిపింది. దీంతో తను వైరల్ గా మారింది. ఇటీవలే జీ తెలుగులో నటుడు జగపతి బాబు నిర్వహిస్తున్న కార్యక్రమానికి హాజరైంది రష్మిక మందన్నా (Rashmika Mandanna). తన వేళ్లకు ఉన్న ఉంగరాల గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. పదే పదే అడగడంతో ఆ ఉంగరం వెరీ వెరీ స్పెషల్ అని, త్వరలోనే దాని గురించి తెలుస్తుందని చెప్పింది నేషనల్ క్రష్ రష్మిక మందన్నా. ఇటీవలే ఈ ఇద్దరూ దండలు, ఉంగరాలు కూడా మార్చుకున్నట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. దీనిపై ఇరువురు స్పందించ లేదు. అయితే ఫోటోలు మాత్రం తెగ వైరల్ గా మారాయి.
Rashmika Mandanna Comments Viral
కాగా తాజాగా చేసిన ట్వీట్ సెన్సేషన్ గా మారి పోయింది. ప్రస్తుతం ట్రెండింగ్ లో కొనసాగుతోంది. ఈ వ్యాఖ్య విజయ్ దేవరకొండతో తన సంబంధం గురించి చాలా కాలంగా ఉన్న పుకార్లను మళ్ళీ రేకెత్తిస్తోంది. కాగా ఎవరితో డేటింగ్ చేయాలని అనుకుంటున్నావంటూ అడిగిన ప్రశ్నకు ఆసక్తికరమైన సమాధానం ఇచ్చింది నటి. తాను విజయ్ ని పెళ్లి చేసుకుంటానంటూ హాస్యంగా చెప్పి అందరినీ ఆశ్చర్య పోయేలా చేసింది. ఆ క్లిప్ త్వరగా సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో వైరల్ అయ్యింది, అభిమానులను ఉన్మాదంలోకి నెట్టేసేలా చేసింది. కాగా రష్మిక ఇటీవల ఒక విలక్షణమైన ఉంగరాన్ని ధరించి కనిపించింది. ఇది నిశ్చితార్థంకు సంబంధించిన ఉంగరం కావచ్చని ఫ్యాన్స్ భావిస్తున్నారు. కాగా ఫిబ్రవరిలో పెళ్లి చేసుకోబోతున్నట్లు సమాచారం.
Also Read : CMD Lotheti Interesting Update : నేడు డయల్ యువర్ ఏపీఎస్పీడీసీఎల్ సీఎండీ


















