కాక్‌టెయిల్ -2 కోసం రష్మిక భారీ రెమ్యూన‌రేష‌న్ ..?

కొన్ని కోట్ల‌కు పైగానే తీసుకుంటుంద‌ని టాక్

hellotelugu-RashmikaMandhanna

ముంబై : న‌టుడు విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో రిలేష‌న్ షిప్ లో ఉన్న ర‌ష్మిక మంద‌న్నా ఉన్న‌ట్టుండి సంచ‌ల‌నంగా మారారు. త‌ను ప్ర‌తి మూవీకి భారీ ఎత్తున రెమ్యూన‌రేష‌న్ తీసుకుంటున్న‌ట్లు పెద్ద ఎత్తున ప్రచారం జ‌రుగుతోంది. ఈ అమ్మ‌డు దీపం ఉండ‌గానే ఇల్లు చక్క‌బెట్టుకునే ప‌నిలో ప‌డింద‌న్న‌మాట‌. దేశంలో అత్యంత డిమాండ్ ఉన్న నటీమణులలో ఒకరిగా రష్మిక ఎదిగారు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, నటి రష్మిక మందన్న తన రాబోయే హిందీ చిత్రం కాక్‌టెయిల్ 2 కోసం ఏకంగా రూ. 15 కోట్లు వసూలు చేస్తున్నారనే వదంతులు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అయితే, పరిశ్రమ వర్గాలు ఈ వార్తలను అతిశయోక్తులుగా కొట్టిపారేశాయి.

ఈ వార్తలు నిజమని నేను అనుకోవడం లేదు అని ఒక ట్రేడ్ వర్గాల సమాచారం. భారతదేశం ,విదేశీ మార్కెట్లలో ఆమెకున్న ప్రజాదరణను పరిగణనలోకి తీసుకుంటే, రష్మిక గరిష్టంగా ₹10 కోట్లు మాత్రమే డిమాండ్ చేయవచ్చు, కానీ ఈ దశలో ₹15 కోట్లు వసూలు చేసే అవకాశం లేదు. దేశంలో అత్యంత డిమాండ్ ఉన్న నటీమణులలో ఒకరిగా రష్మిక ఎదిగారనడంలో సందేహం లేదు. ‘నేషనల్ క్రష్’గా విస్తృతంగా గుర్తింపు పొందిన ఆమె, ‘యానిమల్స‌ , ‘ఛావా’ వంటి విజయవంతమైన చిత్రాలతో బాలీవుడ్‌లో తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంది. ఆమె ‘పుష్ప’ విడుదలకు ముందే హిందీ చిత్రసీమలోకి ప్రవేశించినప్పటికీ, ఆ బ్లాక్‌బస్టర్ ఫ్రాంచైజీ ఆమె దేశవ్యాప్త ఆదరణను, మార్కెట్ విలువను గణనీయంగా పెంచింది. ‘కాక్‌టెయిల్ 2’లో రష్మిక, షాహిద్ కపూర్ , కృతి సనన్‌లతో కలిసి తెరను పంచుకోనుంది.

Exit mobile version