ర‌ణ‌వీర్ సింగ్ కామెంట్స్ హైకోర్టు సీరియ‌స్

ఏం త‌మాషాగా ఉందా అంటూ మండిపాటు

hellotelugu-RanveerSingh

క‌ర్ణాట‌క : నువ్వు హీరోవి కావ‌చ్చు. కానీ నీకంటూ కొంత మ్యాన‌ర్స్ ఉండ‌డం ముఖ్యం. ఇత‌రుల మ‌నో భావాలు దెబ్బ‌తినేలా వ్య‌వ‌హ‌రించడం లేదా మాట్లాడ‌టం మంచి ప‌ద్ద‌తి కాదు. ఇంకోసారి గ‌నుక చిల్ల‌ర వేషాలు వేసినా లేదా ఇత‌రుల గురించి చుల‌క‌న చేసి మాట్లాడినా లేదా మ‌తి తప్పి కామెంట్స్ చేసినా ఊరుకునేది లేదంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది బాలీవుడ్ కు చెందిన ర‌ణ‌వీర్ సింగ్ ను ఉద్దేశించి క‌ర్ణాట‌క రాష్ట్ర హైకోర్టు. దైవాన్ని మిమిక్రీ చేసి అవహేళన చేసినందుకుగాను రణవీర్ సింగ్‌ను తీవ్రంగా మందలించింది: నువ్వు నటుడిగా, చాలా మందిపై ప్రభావం చూపించగలవు. ఎవరి మతపరమైన మనోభావాలను దెబ్బతీసే హక్కు నీకు లేదంటూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది.

నువ్వు రణవీర్ సింగ్ కావచ్చు, నువ్వు ఎవరైనా కావచ్చు. నువ్వు నిర్లక్ష్యంగా ఉన్నావు. నీకు ఇలా చేసే హక్కు లేదంటూ ధ‌ర్మాస‌నం మండిప‌డింది. ఒకానొక స‌మ‌యంలో సీరియ‌స్ కామెంట్స్ చేసింది. కొంత మందికి త‌ల పొగ‌రు ఎక్కుతోంద‌ని, మీరు దైవాంస సంభూతులు కారంటూ పేర్కొంది కోర్టు. రిషబ్ శెట్టి నటించిన కాంతార2 సినిమా ప్రమోషన్ సమయంలో రణవీర్ సింగ్ చుల‌క‌న చేస్తూ మిమిక్రీ చేశాడు. ఆపై అనుచిత వ్యాఖ్య‌లు చేయ‌డంతో దేశ వ్యాప్తంగా ట్రోల్ కు గుర‌య్యాడు. త‌ను చేసిన కామెంట్స్ త‌మ మ‌నోభావాలు దెబ్బ‌తీసేలా ఉన్నాయంటూ కోర్టులో పిటిష‌న్ దాఖ‌లైంది. దీనిపై విచార‌ణ చేప‌ట్టిన కోర్టు సంచ‌ల‌న తీర్పు వెలువ‌రించింది.

Exit mobile version