Hero Rana Daggubati – ED : ప్లీజ్ ఇంకోసారి విచార‌ణ‌కు ఛాన్స్ ఇవ్వండి

కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ ఈడీని కోరిన రానా

Hello Telugu - Hero Rana Daggubati - ED

Hello Telugu - Hero Rana Daggubati - ED

Rana Daggubati : హైద‌రాబాద్ – బెట్టింగ్ యాప్స్ లో కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ ఈడీ దూకుడు పెంచింది. ఇందులో భాగంగా ప‌లువురు సినీ సెలిబ్రిటీల‌కు, ఇన్ఫ్యూయ‌న్స‌ర్స్ కు ఇప్ప‌టికే నోటీసులు జారీ చేసింది. త‌మ ముందు విచార‌ణ‌కు హాజ‌రు కావాల‌ని. ఇదిలా ఉండ‌గా ఈనెల 23న హాజ‌రు కావాల్సి ఉంది న‌టుడు ద‌గ్గుబాటి రానా. తాను షూటింగ్ లో బిజీగా ఉండ‌డం వ‌ల్ల హాజ‌రు కాలేక పోయానని, ద‌య‌చేసి త‌న‌కు ఇంకో తేదీ కేటాయించాల‌ని కోరాడు. ప్ర‌త్యామ్నాయ తేదీల‌ను సూచించాల‌ని, ఆమేర‌కు తాను త‌ప్ప‌కుండా హాజ‌ర‌వుతాన‌ని తెలిపాడు. త‌ను ప్రస్తుతం త‌మిళ‌నాడులోని సుదూర ప్రాంతంలో జ‌రుగుతున్న షూటింగ్ లో బిజీగా ఉన్నాన‌ని పేర్కొన్నాడు.

Rana Daggubati Requesting ED

ఇదిలా ఉండ‌గా బెట్టింగ్ యాప్స్ ప్ర‌మోష‌న్ కేసులో రానా ద‌గ్గుబాటితో (Rana Daggubati) పాటు, ప్రకాష్ రాజ్, విజయ్ దేవరకొండ, మంచు లక్ష్మిలకు ఈడీ ఇప్ప‌టికే సమన్లు జారీ చేసింది. జూలై 30న ప్రకాష్ రాజ్ కు సమన్లు జారీ కాగా ఆగస్టు 6న విజయ దేవరకొండ కు, ఆగస్టు 13న మంచు లక్ష్మి హాజరు కావాలని ఈడీ ఆదేశించింది. కాగా చట్ట విరుద్ధమైన బెట్టింగ్ యాప్ లను సమర్థిస్తున్నారనే ఆరోపణలపై జూలై 10న ఈడీ కేసు నమోదు చేసిన 29 మంది ప్రముఖులలో ఈ నలుగురు నటులు కూడా ఉన్నారు.

పబ్లిక్ జూదం చట్టం, 1867ను ఉల్లంఘించి అక్రమ బెట్టింగ్ ప్లాట్‌ఫామ్‌లను ప్రోత్సహించినందుకు 29 మంది నటులు, ఇన్‌ఫ్లుయెన్సర్లు , యూట్యూబర్లపై కేంద్ర ఏజెన్సీ ఈసీఐఆర్ దాఖలు చేసింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో నమోదైన ఐదు ఎఫ్‌ఐఆర్‌ల ఆధారంగా మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద దర్యాప్తు జరిగింది. ఇక నిధి అగ‌ర్వాల్, ప్ర‌ణీత సుభాష్, అన‌న్య నాగ‌ళ్ల‌పై కూడా కేసు న‌మోదైంది. శ్రీముఖి, శ్యామల, వర్షిణి సౌందరరాజన్ , వసంతి కృష్ణన్, శోభా శెట్టి, అమృత చౌదరి, నయాని పావని, నేహా పఠాన్, పాండు, పద్మావతి, హర్ష సాయి, బయ్యా సన్నీ యాదవ్ కూడా ఈ జాబితాలో ఉన్నారు.

Also Read : Saiyaara Movie Collections Sensational : అంత‌టా సైయారా క‌లెక్షన్ల పండుగ‌

Exit mobile version