Saiyaara : బాలీవుడ్ ను షేక్ చేస్తోంది సైయారా మూవీ. కొత్త దర్శకుడు మోహిత్ సూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఎవరూ ఊహించని పాజిటివ్ టాక్ ను తెచ్చుకుంది. పూర్తిగా రొమాంటిక్ కథా చిత్రంగా మార్చేశాడు. చాలా భిన్నంగా చెప్పేందుకు ప్రయత్నం చేశాడు. ఇందులో అహాన్ పాండే, అనీత్ పద్దా కీ రోల్స్ పోషించారు. తాజాగా సినీ వర్గాలు అందించిన సమాచారం మేరకు సైయారా (Saiyaara) రూ. 200 కోట్లను సునాయాసంగా దాటేసింది. బయ్యర్స్ కు ఊహించని రీతిలో లాభాలను తెచ్చి పెట్టింది. ఇక ఈ మూవీ రెండో వారాంతం ముగిసే సరికి రూ. 250 కోట్లను సులభంగా దాటేయడం ఖాయమని ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి. కొత్త ముఖాలు నటించిన సినిమాకి ఒక గొప్ప బెంచ్‌మార్క్ అని చెప్పక తప్పదు.
Saiyaara Movie Collections
విక్కీ కౌశల్ , నేషనల్ క్రష్ రష్మిక మందన్నా కలిసి నటించిన ఛావా తర్వాత ఈ సంవత్సరం రెండవ అత్యధిక వారం వసూళ్లు సాధించిన చిత్రంగా మోహిత్ సూరి తీసిన సైయారా నిలిచింది. ఎవరూ – వారి కలలలో కూడా కాదు – రోజురోజుకూ సైయారా తన అసాధారణ సంఖ్యలతో పరిశ్రమను షేక్ చేస్తుందని ఊహించలేరు అంటూ పేర్కొన్నాడు ప్రముఖ ఫిల్మ్ ట్రేడ్ విశ్లేషకకుడు తరణ్ ఆదర్శ్. ఎపిక్ బ్లాక్ బస్టర్ అంటూ కితాబు ఇచ్చాడు. సితారే జమీన్ పర్ వంటి బాలీవుడ్ దిగ్గజాలు ఒక నెలలోనే పెద్ద తెరపై సాధించలేక పోయిన ఈ మైలు రాయిని ఈ సినిమా చేరుకోవడం ఒకింత కొత్తగా రావాలని అనుకునే టెక్నీషియన్స్ కు మరింత బలం ఇచ్చేలా చేసింది.
Also Read : Hero Sandeep Kishan : జాసన్ విజయ్ కి మంచి భవిష్యత్తుంది
