రైల్వే శాఖ మంత్రితో రామ్మోహ‌న్ నాయుడు భేటీ

సౌత్ కోస్ట్ రైల్వే జోన్ కార్య‌కలాపాల‌పై విస్తృత చ‌ర్చ‌

hellotelugu-RamMohanNaidu

న్యూఢిల్లీ : కేంద్ర విమానాయ‌న శాఖ మంత్రి కింజార‌పు రామ్మోహ‌న్ నాయుడు రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణ‌వ్ తో ప్ర‌త్యేకంగా భేటీ అయ్యారు. న్యూఢిల్లీ లోని రైల్ భవన్‌లో కేంద్ర రైల్వే మంత్రితో కీల‌క అంశాల‌పై చ‌ర్చించారు. ఈ సంద‌ర్బంగా ధోలేరా అంతర్జాతీయ విమానాశ్రయం పురోగతి గురించి ప్ర‌స్తావించారు. అంతే కాకుండా విశాఖపట్నం కేంద్రంగా సౌత్ కోస్ట్ రైల్వే జోన్ కార్యకలాపాలు ప్రారంభం పై చర్చించారు అచ్చెన్నాయుడు.

శ్రీకాకుళం జిల్లాలో రైల్వే మౌలిక సదుపాయాల బలోపేతంపై ప్రత్యేకంగా దృష్టి సారించామని తెలిపారు కేంద్ర మంత్రి. ముఖ్యంగా శ్రీకాకుళం నుండి సికింద్రాబాద్, తిరుపతికి నేరుగా రైళ్లు, మందస రోడ్, పాతపట్నం, హరిశ్చంద్రపురం స్టేషన్లలో కీలక రైలు నిలుపుదల చేయాల‌ని సూచించారు రామ్మోహ‌న్ నాయుడు, కామేశ్వరీపేట హాల్ట్ స్టేషన్ అభివృద్ధి, ఎన్‌హెచ్-16 పక్కన ఉన్న హరిశ్చంద్రపురం స్టేషన్‌ను లాజిస్టిక్స్ హబ్‌గా అప్‌గ్రేడ్ చేయడం వంటి అంశాలపై అశ్విని వైష్ణ‌వ్ తో చ‌ర్చించారు. కొత్త ROBలు/RUBలు , స్టేషన్ లలో ప్రయాణికుల సౌకర్యాలపై కూడా ప్రతిపాదనలు అందించిన‌ట్లు తెలిపారు.

మంత్రి అశ్విని వైష్ణ‌వ్ తో కలసి కంట్రోల్ రూమ్ లో పనితీరును సమీక్షిస్తూ, ప్రయాణికుల భద్రతకు తీసుకుంటున్న చర్యలపై వివరాలు తెలుసుకున్నట్లు చెప్పారు కింజార‌పు అచ్చెన్నాయుడు. ధోలేరా అభివృద్ధికి అనుగుణంగా రైల్వే మౌలిక వసతులను సమన్వయం చేస్తూ, భవిష్యత్ విస్తరణకు అనుకూలంగా ఎయిర్–రైల్ కనెక్టివిటీపై కూడా చర్చించడం జ‌రిగింద‌న్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి దార్శనిక నాయకత్వంలో ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేందుకు, సమగ్ర మల్టీ-మోడల్ కనెక్టివిటీ ద్వారా దేశ నిర్మాణాన్ని వేగవంతం చేయడానికి తాము క‌ట్టుబ‌డి ఉన్నామ‌ని స్ప‌ష్టం చేశారు.

Exit mobile version