Rajasthan Royals Important Update : రాజ‌స్థాన్ రాయ‌ల్స్ హెడ్ కోచ్ గా సంగ‌క్క‌ర‌

ప్ర‌క‌టించిన ఆర్ఆర్ ఓన‌ర్ మ‌నోజ్ బ‌దాలే

Hello Telugu - Rajasthan Royals Important Update

Hello Telugu - Rajasthan Royals Important Update

Rajasthan Royals : రాజస్థాన్ : శ్రీ‌లంక‌కు చెందిన టాప్ క్రిక‌ట‌ర్ గా గుర్తింపు పొందిన కుమార సంగ‌క్క‌రకు కీల‌క‌మైన ప‌ద‌వి మ‌రోసారి ద‌క్కింది. ఈ విష‌యాన్ని ఐపీఎల్ లో భాగ‌స్వామి జ‌ట్టుగా ఉన్న రాజ‌స్థాన్ రాయ‌ల్స్ (Rajasthan Royals) ఓన‌ర్ మ‌నోజ్ బ‌దాలే ఈ విష‌యాన్ని ప్ర‌క‌టించారు. మంగ‌ళ‌వారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. త‌మ జ‌ట్టుకు చోద‌క శ‌క్తిగా కుమార సంగ‌క్క‌ర ఉండ‌బోతున్నార‌ని తెలిపారు. త‌ను హెడ్ కోచ్ గా తిరిగి రావ‌డం త‌మ‌కు సంతోషంగా ఉంద‌న్నారు. జ‌ట్టుపై లోతైన అవగాహ‌న త‌న‌కు ఉంద‌న్నారు. టీంను ఒకేతాటిపైకి తీసుకు రావ‌డంలో త‌ను చేసిన కృషి గ‌తంలో గొప్పగా ఉంద‌న్నారు. ప్ర‌ధానంగా జ‌ట్టుకు ఏం కావాలో త‌న‌కు బాగా తెలుస‌ని అన్నారు. అందుకే తాము ఏరికోరి కుమార సంగ‌క్క‌ర‌ను ఎంచుకున్న‌ట్లు చెప్పారు రాజ‌స్థాన్ రాయ‌ల్స్ జ‌ట్టు ఓన‌ర్ మ‌నోజ్ బ‌దాలే.

Sangarkar As a Rajasthan Royals New Head

త‌ను శ్రీ‌లంక జ‌ట్టును బ‌ల‌మైన శ‌క్తిగా మార్చాడ‌ని , ఇదే అనుభ‌వం త‌మ జ‌ట్టుకు కూడా ఉప‌యోగ ప‌డుతుంద‌ని స్ప‌ష్టం చేశారు. క్రికెట్ ఆట ప‌ట్ల త‌న‌కున్న అవ‌గాహ‌న ఏ క్రికెట‌ర్ కు లేద‌ని పేర్కొన్నారు. త‌ను హెడ్ కోచ్ గా రావ‌డం ప‌ట్ల త‌మ జ‌ట్టు స‌భ్యులు కూడా సంతోషం వ్య‌క్తం చేస్తున్నార‌ని తెలిపారు మ‌నోజ్ బ‌దాలే. కుమార సంగ‌క్క‌ర ప్ర‌ధాన కోచ్ గా ఉన్నందు వ‌ల్ల‌నే త‌మ జ‌ట్టు ఫైన‌ల్ కు చేరుకుంద‌ని చెప్పారు. ఈసారి జ‌ర‌గ‌బోయే ఇండియ‌న్ ప్రిమియ‌ర్ లీగ్ (ఐపీఎల్) 2026లో రాజ‌స్థాన్ రాయ‌ల్స్ జట్టు త‌ప్ప‌కుండా అద్భుతంగా రాణిస్తుంద‌ని చెప్పారు. త‌ప్ప‌కుండా కప్పు గెలుచుకుంటామ‌ని ధీమా వ్య‌క్తం చేశారు మ‌నోజ్ బ‌దాలే.

Also Read : Telangana High Court Fired on Hydraa :హైడ్రా క‌మిష‌న‌ర్ నిర్వాకం హైకోర్టు ఆగ్ర‌హం

Exit mobile version