ప్ర‌జ‌లు ప‌వ‌న్ కు ప‌ట్టాభిషేకం చేయ‌లేదు

రామ్ గోపాల్ వ‌ర్మ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

hellotelugu-RGV

హైద‌రాబాద్ : వివాదాస్ప‌ద ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. తాజాగా ప‌వ‌న్ క‌ళ్యాణ్ పై సీరియ‌స్ కామెంట్స్ చేశారు విల‌క్ష‌ణ న‌టుడు ప్ర‌కాశ్ రాజ్. ఆయ‌న‌కు మ‌ద్ద‌తుగా ట్వీట్ చేశారు ఆర్జీవీ. నాగబాబు చేసిన వ్యాఖ్యలకు కౌంటర్‌గా నటుడు ప్రకాష్ రాజ్ పెట్టిన ట్వీట్‌కు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (RGV) మద్దతు ప‌లికారు. ప్రజాస్వామ్యంలో ప్రజలు నాయకుడికి ఓ బాధ్యతను అప్పగిస్తారే తప్ప, అతనికి రాజుగా పట్టాభిషేకం చేయరు పేర్కొన్నారు. ఏపీకి డిప్యూటీ సీఎంగా ఉన్న ప‌వ‌న్ క‌ల్యాణ్ కొణిద‌ల‌కు ఇంకా ప్ర‌జాస్వామ్యం అంటే ఏమిటో అర్థం కాలేద‌న్నారు.

వ్య‌వ‌స్థ‌ల‌ను అర్థం చేసుకోనంత కాలం ఇలా అనుచిత వ్యాఖ్య‌లు చేయ‌డం, ఆ త‌ర్వాత అభాసుపాలు కావ‌డం ష‌రా మామూలేన‌ని పేర్కొన్నారు. త‌న‌కు ఏపీ ప్ర‌జ‌లు అద్భుతమైన అవ‌కాశాన్ని ఇచ్చార‌ని, కానీ దానిని గుర్తించ‌కుండా ప్రాంతాల మ‌ధ్య‌, ప్ర‌జ‌ల మ‌ధ్య విద్వేష పూరిత వ్యాఖ్య‌లు చేస్తామంటే ఎలా అని ప్ర‌శ్నించారు. ఇదిలా ఉండ‌గా తెలంగాణ ప్రాంతానికి ఆత్మ గౌర‌వం ఎక్కువ‌గా ఉంటుంద‌ని తెలుసుకోలేక పోవ‌డం దారుణం. పోరాటాలు, త్యాగాలు, బ‌లిదానాలు ఈ ప్రాంతానికి ఉన్న ఘ‌న‌మైన చ‌రిత్ర‌. ఇక‌నుంచైనా ప‌వ‌న్ క‌ళ్యాన్ త‌న నోరును అదుపులో పెట్టుకుంటే మంచిద‌ని తెలంగాణ వాదులు హిత‌వు ప‌లుకుతున్నారు. ఇంకోసారి గ‌నుక గీత దాటితే తీవ్ర ప‌రిణామాలు ఎదుర్కోవాల్సి వ‌స్తుంద‌ని క్రాంతి ద‌ళ్ సేన చీఫ్ క్రాంతి యాద‌వ్ వార్నింగ్ ఇచ్చారు.

Exit mobile version