హైదరాబాద్ : బుచ్చిబాబు సన దర్శకత్వం వహించిన రామ్ చరణ్ , జాహ్నవి కపూర్ , జగపతి బాబు, శివ రాజ్ కుమార్ కలిసి నటించిన చిత్రం పెద్ది. ప్రేక్షకుల ముందుకు వచ్చింది. బెనిఫిట్ షోస్, ఓపెనింగ్ టాక్ బాగానే ఉన్నా ఆ తర్వాత వసూళ్లలో తగ్గుదల కనిపించడం ఒకింత ఆందొళనకు గురి చేసింది. పెద్దికి మిశ్రమ స్పదన రావడం పట్ల జోరుగా చర్చ జరుగుతోంది. భారీ అంచనాల మధ్య విడుదలైన స్పోర్ట్స్ డ్రామాగా రూపొందించాడు పెద్ది మూవీని దర్శకుడు. తొలి రోజు తెలుగు రాష్ట్రాల్లో రూ. 60 కోట్లకు పైగా షేర్ వసూలు చేసి సంచలనం సృష్టించింది. కాగా రెండో రోజున వసూళ్లు గణనీయంగా తగ్గి, సుమారు రూ. 26 కోట్ల షేర్ మాత్రమే సాధించినట్లు సమాచారం. ఈ తగ్గుదల ఉన్నప్పటికీ, రామ్ చరణ్ నటించిన ఈ చిత్రం ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో రూ. 85 కోట్ల షేర్ మార్కును దాటింది.
బలమైన మొదటి వారాంతాన్ని నమోదు చేసే దిశగా సాగుతోంది. అయినప్పటికీ, సుమారు రూ. 140 కోట్ల థియేట్రికల్ బిజినెస్ మొత్తాన్ని తిరిగి రాబట్టడానికి ఈ సినిమా ఇంకా చాలా దూరం ప్రయాణించాల్సి ఉంది. అలాగే ఇది ఖచ్చితంగా మిశ్రమ స్పందనను కూడా ఎదుర్కొంటోంది. నిర్మాత లగడపాటి శ్రీధర్ వసూళ్ల తగ్గుదలను అంగీకరిస్తూనే, సినిమాలోని బలమైన అంశాలు చెక్కు చెదరలేదని నమ్ముతున్నారు. ఈ పాత్ర కోసం రామ్ చరణ్ ఎంతో కష్టపడ్డారు. రెజ్లర్, క్రికెటర్, రన్నర్‌గా సహజంగా కనిపించేలా ఆయన తన శారీరక రూపాన్ని మార్చుకున్నారు. చివరికి, ఈ సినిమా పూర్తిగా ఆయన అద్భుత నటనతో నడిచే ‘వన్-మ్యాన్ షో’గా నిలిచింది అని అన్నారు. ప్రేక్షకుల నుండి మిశ్రమ స్పందన వచ్చిందని కూడా ఆయన అంగీకరించారు.
