అక్బరుద్దీన్ ఒవైసీపై పైడి రాకేష్ రెడ్డి ఫైర్

ప్రేమ‌తో చేర‌దీస్తే పాములై కాటేస్తున్నారు

hellotelugu-RakeshReddy.jpg

నిజామాబాద్ జిల్లా : ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఆయ‌న‌కు అంత సీన్ లేద‌న్నారు. శుక్ర‌వారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. ఇదిలా ఉండ‌గా రెడ్డి, కాపు, వెలమ ఎవరైనా కానీ నా కాళ్ల దగ్గరికి రావాల్సిందే అని అక్బరుద్దీన్ కామెంట్స్ చేయ‌డాన్ని తీవ్రంగా తప్పు ప‌ట్టారు. ఇంత బ‌లుపు మాట‌లు ఎలా మాట్లాడుతున్నారంటూ ప్ర‌శ్నించారు. ముస్లింల‌ను ఎమ్మెల్యే పాముల‌తో పోల్చారు. అందుకే పాకిస్తాన్, బంగ్లాదేశ్ ల‌లో హిందులపై దాడులు చేశారంటూ ధ్వ‌జ‌మెత్తారు. తాము ఏదో సాటి మ‌నుషుల‌మ‌ని
ప్రేమతో చేరదీస్తే పాములై మమ్మల్ని కాటు వేస్తున్నారంటూ ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఓవైసీ అన్న‌ద‌మ్ములు ఇద్ద‌రూ మొద‌టి నుంచి హిందువుల‌తో స‌ఖ్య‌త‌గా లేర‌న్నారు. వారికి మ‌తం పిచ్చి ఎక్కువ అంటూ మండిప‌డ్డారు.

త‌మ హిందువుల గురించి ఇంకొక్క‌సారి నోరు జారితే బాగుండ‌ద‌ని అన్నారు. తీవ్ర ప‌రిణామాలు ఎదుర్కోవాల్సి వ‌స్తుంద‌ని హెచ్చ‌రించారు ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి. తాము ఇప్ప‌టి వ‌ర‌కు ముస్లింల‌ను కూడా సోద‌రులుగా , సోద‌రీమ‌ణులుగా భావిస్తూ వ‌చ్చామ‌న్నారు. కానీ ఓవైసీ బ్ర‌ద‌ర్స్ అలా అనుకోవ‌డం లేద‌న్నారు. ఇలాంటి వాళ్ల‌ను చేర‌దీసిన చ‌రిత్ర గ‌త బీఆర్ఎస్, నేటి కాంగ్రెస్ పార్టీల‌దేన‌ని పేర్కొన్నారు. అయినా హిందూ స‌మాజం ఇలాంటి వారి ప‌ట్ల జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని హెచ్చ‌రించారు ఎమ్మెల్యే.

Exit mobile version