వైఎస్ షర్మిలకు రాజ్య‌స‌భ‌ సీటు ఖ‌రారు

అధికారికంగా ప్ర‌క‌టించిన ఏఐసీసీ చీఫ్

hellotelugu-YSSharmila

న్యూఢిల్లీ : ఏపీ పీసీసీ రాష్ట్ర అధ్య‌క్షురాలు, దివంగ‌త సీఎం వైఎస్ఆర్ త‌న‌యురాలు వైఎస్ ష‌ర్మిలా రెడ్డికి తీపి క‌బురు చెప్పింది ఏఐసీసీ హైక‌మాండ్. గ‌త కొన్నిరోజులుగా ఆమెకు రాజ్య‌స‌భ సీటు వ‌స్తుంద‌ని జోరుగా ప్ర‌చారం జ‌రిగింది. ఇందుకు సంబంధించి పెద్ద ఎత్తున లాబీయింగ్ కూడా చేశార‌ని వినికిడి. కానీ ఇందుకు సంబంధించి ఎలాంటి ప్ర‌క‌ట‌న చేయ‌లేదు ష‌ర్మిలా రెడ్డి. తాజాగా సోమ‌వారం ఏఐసీసీ హైక‌మాండ్ రాజ్య‌స‌భ సీటు కేటాయింపున‌కు సంబంధించి కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. ఈ మేర‌కు అధికారికంగా అప్ డేట్ ఇచ్చే ప్ర‌య‌త్నం చేసింది. ష‌ర్మిలా రెడ్డికి రాజ్య‌స‌భ సీటును ఖ‌రారు చేస్తున్న‌ట్లువెల్ల‌డించారు ఏఐసీసీ జాతీయ అధ్య‌క్షుడు మ‌ల్లికార్జున్ ఖ‌ర్గే.

అయితే ఏపీ నుంచి కాకుండా త‌న‌కు క‌ర్ణాట‌క రాష్ట్రం నుంచి రాజ్య‌స‌భ‌కు పంపించాల‌ని నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు ప్ర‌క‌టించారు. సోమ‌వారం ఖ‌ర్గే మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్‌ పార్టీలో చేరే సమయంలోనే రాజ్యసభ సీటు ఇస్తామని షర్మిలకు పార్టీ హైక‌మాండ్ హామీ కూడా ఇచ్చిన‌ట్లు తెలిపారు. అయితే ష‌ర్మిలా రెడ్డి ఢిల్లీలో బిజీగా ఉన్నారు. ఆమె మ‌ర్యాద పూర్వ‌కంగా అగ్ర నేత రాహుల్ గాంధీని క‌లుసుకున్నారు. వివిధ అంశాల‌పై చ‌ర్చించారు. ష‌ర్మిలా రాజ్య‌స‌భ సీటుకు సంబంధించి పూర్తిగా క్లారిటీ ఇచ్చే ప్ర‌య‌త్నం చేసింది ష‌ర్మిలా రెడ్డి.

Exit mobile version