Raju Weds Rambai Movie Sensational : రాజు వెడ్స్ రాంబాయి చిత్రం ఈటీవీ విన్ స్వంతం

తెలుగు చ‌ల‌న చిత్ర ప‌రిశ్ర‌మ‌లో భారీ వ‌సూళ్లు

Hello Telugu - Raju Weds Rambai Movie Sensational

Hello Telugu - Raju Weds Rambai Movie Sensational

Raju Weds Rambai : నూత‌న ద‌ర్శ‌కుడు సాయిలు కాంప‌తి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన చిత్రం రాజు వెడ్స్ రాంబాయి. ఎవ‌రూ ఊహించ‌ని రీతిలో భారీ ఎత్తున ఆద‌ర‌ణ చూర‌గొంటోంది. ఇప్ప‌టికే ఈ సినిమాకు సంబంధించిన పాట‌లు దుమ్ము రేపుతున్నాయి. ముఖ్యంగా మిట్ట‌ప‌ల్లి సురేంద‌ర్ రాసిన పాట రాంబాయి నీమీద నాకు మ‌న‌సాయెనే ఎక్క‌డ చూసినా వినిపిస్తోంది. గుండెల‌ను మీటుతోంది. రాజు వెడ్స్ రాంబాయి (Raju Weds Rambai) మూవీ న‌వంబ‌ర్ 17న విడుద‌లైంది. అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంటోంది. దీనిని ఆద‌రిస్తుండ‌డం ప‌ట్ల ద‌ర్శ‌క‌, నిర్మాత‌లు సంతోషం వ్య‌క్తం చేస్తున్నారు. అంతే కాదు ఈ చిత్రం అనేక వర్గాల నుండి సానుకూల సమీక్షలను అందుకుంది.

Raju Weds Rambai Movie Talk

మూవీ బాక్సాఫీస్ వద్ద మొదటి వారాంతంలో రూ. 7 కోట్లకు పైగా వసూలు చేసిన‌ట్లు సినీ వ‌ర్గాల బోగ‌ట్టా. తాజాగా రాజు వెడ్స్ రాంబాయి చిత్రానికి సంబంధించి కీల‌క అప్ డేట్ వ‌చ్చింది. ఈ చిత్రం డిజిటల్ హక్కులను ప్ర‌ముఖ సంస్థ ఈటీవీ విన్ స్వంతం చేసుకుంది. థియేటర్లలో విడుదలైన నాలుగు వారాల తర్వాత ఈ లవ్ స్టోరీ డిజిటల్ విడుదల అవుతుందని భావిస్తున్నారు. అంటే వ‌చ్చే ఏడాది జ‌న‌వ‌రిలో ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. అఖిల్ రాజ్-తేజస్విని రావు చిత్రానికి సంబంధించి అధికారిక డిజిటల్ విడుదల తేదీని మేకర్స్ ఇంకా ప్రకటించలేదు. ఈ చిత్రంలో చైతన్య జొన్నలగడ్డ, శివాజీ రాజా, అనిత చౌదరి కీలక పాత్రలు పోషించారు. సినిమా విడుద‌ల సంద‌ర్బంగా ఎలాంటి టికెట్ ధ‌ర‌లు పెంచ‌క పోవ‌డం క‌లిసి వ‌చ్చేలా చేసింది.

Also Read : Minister Nadendla Manohar Important Update : రైతుల ధాన్యానికి క‌నీస మ‌ద్ద‌తు ధ‌ర క‌ల్పిస్తాం

Exit mobile version