Coolie : కోలీవుడ్ లో ఇప్పుడు ఒకే ఒక్కడి పేరు ఎక్కువగా పాపులర్ అయ్యింది. ఎవరో కాదు మోస్ట్ డైనమిక్ డైరెక్టర్ గా పేరు పొందిన లోకేష్ కనగరాజ్. తను తాజాగా రూపొందించిన మూవీ కూలీ (Coolie). ఇందులో జనాదరణ పొందిన నటుడు పవర్ స్టార్ రజనీకాంత్ నటించాడు. దీనిపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఆగస్టు 14న లాక్ చేశారు మూవీ మేకర్స్. ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ మూవీ. దీనిపై అభిమానులు ఆశలు పెట్టుకున్నారు. ఇప్పటికే రిలీజ్ చేసిన పోస్టర్స్ , ట్రైలర్, టీజర్ కెవ్వు కేక అనిపించేలా ఉన్నాయి. దీంతో దర్శకుడితో పాటు నిర్మాణ సంస్త ఫుల్ కాన్ఫిడెన్స్ గా ఉంది.
Coolie Movie Sensational Records
సినిమాకు సంబంధించి రిలీజ్ చేసిన స్పెషల్ సాంగ్ సెన్సేషన్ క్రియేట్ చేసింది. రజనీ సినీ కెరీర్ లో అత్యధికంగా ఓవర్సీస్ లో భారీ ధరకు అమ్ముడు పోయిన ఏకైక చిత్రంగా నిలిచి పోయింది కూలీ మూవీ. ఏకంగా రూ. 80 కోట్లకు పైగా వసూలు చేసినట్లు సమాచారం. అంతే కాదు ప్రపంచ వ్యాప్తంగా 100 కు పైగా దేశాలలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇది కూడా ఓ రికార్డ్. ఇంకా కూలీ విడుదల కాకుండానే రికార్డులను బ్రేక్ చేస్తోంది.
ఇదిలా ఉండగా ఈ ఆగస్ట్ లో బిగ్గెస్ట్ బాక్సాఫీస్ క్లాష్ కానుండడం విశేషం. ఇదే నెలలో రజనీ నటించిన కూలీ ..ఎన్టీఆర్ , రోషన్ , సనన్ కలిసి నటించిన మూవీ వార్ 2 రానున్నాయి. దేశ వ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటి నుంచే టాకీసులు ఎవరికి దక్కుతాయనే దానిపై టెన్షన్ నెలకొంది.
కూలీ సౌత్ లో హవా కొనసాగిస్తే వార్ నార్త్ లో హవా కొనసాగించే ఛాన్స్ ఉంది.
Also Read : Popular Director Harish Shankar : దూకుడు పెంచిన హరీష్ శంకర్


















