Coolie : తమిళ సినీ దర్శకుడు లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించిన చిత్రం కూలీ. రిలీజ్ కాకుండానే రికార్డ్ ల మోత మోగిస్తోంది. ఇప్పటి వరకు రిలీజ్ చేసిన పోస్టర్స్, టీజర్ , ట్రైలర్ కు పెద్ద ఎత్తున స్పందన లభించింది. దీంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఓ వైపు ఏజ్ పెరుగుతున్నా తన స్టార్ ఇమేజ్ కు ఢోకా లేదంటూ తనను తను ప్రూవ్ చేసుకున్నారు కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్. ఇదిలా ఉండగా కూలీ సినిమా రైట్స్ కు పెద్ద ఎత్తున డిమాండ్ నెలకొంది.
Thalaiva Coolie Movie Rites Price
తాజాగా సంచలన ప్రకటన చేసింది మూవీ నిర్మాణ సంస్థ. కూలీ (Coolie) ఓవర్సీస్ హక్కులు ఏకంగా రూ. 86 కోట్లకు అమ్ముడు పోయాయని వెల్లడించింది. కొత్త రికార్డు సృష్టించారు రజనీకాంత్. ఆయన గతంలో నటించిన ఇదే సంస్థ నిర్మించిన జైలర్ సూపర్ హిట్ అయ్యింది. బ్లాక్ బస్టర్ గా మోత మోగించింది. ఇప్పటి వరకు ఏ తమిళ చిత్రానికి ఓవర్సీస్ లో ఇంత భారీ ధర రాలేదని సినీ వర్గాలు పేర్కొంటున్నాయి.
ప్రపంచ వ్యాప్తంగా సూపర్ స్టార్ కు పెద్ద ఎత్తున ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. విచిత్రం ఏమిటంటే తన వయసు 74 ఏళ్లు. భారీ ఒప్పందం కూలీని భారతీయ సినిమాలో అత్యంత ఎదురు చూస్తున్న సినిమాలలో ఒకటిగా నిలిచింది. లోకేష్ కనగరాజ్ ప్రస్తుతం సంచలనంగా మారారు. తనపై దిగ్గజ హీరోలు ఎక్కువగా ఫోకస్ పెట్టారు. ఇటీవలే బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ తనతో సినిమా చేసేందుకు సిద్దంగా ఉన్నట్లు ప్రకటించారు.
ఇక కూలీ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మించింది తమిళ సినీ పరిశ్రమకు చెందిన సన్ పిక్చర్స్ యాజమాన్యం. సూపర్ యాక్షన్ త్రిల్లర్ గా తీర్చి దిద్దాడు దర్శకుడు లోకేష్ కనగరాజ్. ఇదిలా ఉండగా కూలీ చిత్రాన్ని వచ్చే నెల ఆగస్టు 14న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు ప్రకటించారు.
Also Read : Nayanthara Shocking Comments : అందాల ముద్దుగుమ్మ నయన్ కామెంట్స్ కలకలం

















