Rajinikanth : దమ్మున్న దర్శకుడు లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించిన కూలీ సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ఇప్పటికే ఓవర్సీస్ లో ఏకంగా రూ. 80 కోట్లకు రైట్స్ అమ్ముడు పోయాయి. రజనీకాంత్ (Rajinikanth) సినీ కెరీర్ లోనే అత్యధిక రేట్ పలికిన చిత్రంగా ఇది రికార్డ్ నమోదు చేసింది. తాజాగా ఈ మూవీకి సంబంధించి స్పెషల్ సాంగ్ ను విడుదల చేశారు మూవీ మేకర్స్. ఇందులో లవ్లీ బ్యూటీ పూజా హెగ్డే నటించగా మలయాళ సినీ రంగానికి చెందిన నటుడు షబీర్ కీ రోల్ పోషించాడు. ఇప్పుడు ఎక్కడ చూసినా లవ్ యూ మోనికా సాంగ్ వినిపిస్తోంది. సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. మిలియన్ల కొద్దీ వ్యూస్ స్వంతం చేసుకుంది. ఇప్పటికే రిలీజ్ కాకుండానే రికార్డుల మోత మోగిస్తోంది.
Rajinikanth Emotional on Coolie Movie
కూలీ చిత్రాన్ని భారీ ఖర్చుతో నిర్మించింది డీఎంకే ఎంపీ దయానిధి మారన్ కు చెందిన సన్ పిక్చర్స్ సంస్థ. ఇదే సంస్థ రజనీకాంత్ తో జైలర్ తీసింది. ఇది ఆశించిన దానికంటే అత్యధికంగా వసూళ్లను సాధించింది. బ్లాక్ బస్టర్ గా నిలిచేలా చేసింది. ప్రస్తుతం రజనీకాంత్ ముఖ్య పాత్రలో నటించిన చిత్రం కూలీ. దీనిని ఆగస్టు 14న రిలీజ్ చేయాలని ఫిక్స్ చేశారు. ఇప్పటికే విడుదల చేసిన పోస్టర్స్, టీజర్, ట్రైలర్, సాంగ్స్ కెవ్వు కేక అనిపించేలా ఉన్నాయి.
ఇక 74 ఏళ్ల వయసు వచ్చినా రజనీకాంత్ టాప్ హీరోగానే కొనసాగుతూ వస్తున్నాడు. తను కూలీ చిత్రంపై స్పందించాడు. తీవ్ర భావోద్వేగానికి లోనయ్యాడు. తన జీవితంంలో దళపతి సినిమా ఓ భాగమైతే కూలీ రెండో భాగమని స్పష్టం చేశాడు. కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఈ సందర్బంగా తనకు ఛాన్స్ ఇచ్చిన దర్శకుడు లోకేష్ కనగరాజ్ కు థ్యాంక్స్ తెలిపాడు తలైవా.
Also Read : Youtube New Rules Shocking : నేటి నుంచి యూట్యూబ్ కొత్త రూల్స్



















