Coolie : సన్ పిక్చర్స్ భారీ బడ్జెట్ తో నిర్మించిన డైనమిక్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించిన రజనీకాంత్, శ్రుతీ హాసన్, ఉపేంద్ర, అక్కినేని నాగార్జున, అమీర్ ఖాన్ , తదితరులు నటించిన చిత్రం కూలీ (Coolie) ట్రైలర్ విడుదలైంది. అట్టహాసంగా రిలీజ్ కార్యక్రమం జరిగింది. ఈ సందర్బంగా ఇందులో కీ రోల్ పోషించిన టాలీవుడ్ స్టార్ హీరో అక్కినేని నాగార్జున ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఒక్క కూలీ మూవీ వంద బాషాలతో సమానం అన్నాడు. ఆయన చసిన ఈ కామెంట్స్ ఇప్పుడు సినీ ఇండస్ట్రీని షేక్ చేస్తున్నాయి. భారీ బడ్జెట్ తో నిర్మించింది సినీ నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్. ఇప్పటికే తమ సంస్థ ఆధ్వర్యంలో రజనీకాంత్ తో తీసిన జైలర్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది.
Coolie Movie Trailer Updates
ప్రస్తుతం కూలీ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. మరో వైపు ఆగస్టు 14న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుందని ప్రకటించారు మూవీ మేకర్స్. ఇప్పటికే రిలీజ్ చేసిన పోస్టర్స్, టీజర్, ట్రైలర్, సాంగ్స్ కెవ్వు కేక అనిపించేలా ఉన్నాయి. ఇక ఓవర్సీస్ రైట్స్ విషయంలో కూలీ సినిమా రికార్డుల మోత మోగించింది. ఏకంగా రజనీకాంత్ సినీ కెరీర్ లోనే బిగ్గెస్ట్ రైట్స్ రేట్స్ పలకడం విశేషం. వరల్డ్ వైడ్ గా ఏకంగా రూ. 80 కోట్లకు పైగా అమ్ముడు పోయింది. అంతే కాదు ప్రపంచ వ్యాప్తంగా 100 కు పైగా దేశాలలో కూలీ మూవీ రిలీజ్ చేస్తున్నారు. మరోసారి స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ తన మ్యూజిక్ తో మ్యాజిక్ చేశాడు. కూలీ చిత్రంలో స్పెషల్ సాంగ్ తో దుమ్ము రేపింది పూజా హెగ్డే. విచిత్రం ఏమిటంటే ఈ కూలీ సినిమాలో అందరూ 50 ఏళ్లకు పైబడిన వారే కావడం విశేషం. వీరందరితో సినిమా తీయడం మామూలు విషయం కాదు.
Also Read : Hero Rajinikanth – Coolie : ఒక కూలీ చిత్రం వంద బాషాలతో సమానం – నాగార్జున

















