Coolie : డైనమిక్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించిన లోకేష్ కనగరాజ్ మూవీ కూలీ (Coolie). ఇందులో ప్రదాన పాత్ర పోషించారు సూపర్ స్టార్ రజనీకాంత్. తనతో పాటు శ్రుతీ హాసన్ కీరోల్ పోషించింది. ఇందుకు సంబంధించి వచ్చే ఆగస్టు 14 న విడుదల కానుంది. భారీ ఖర్చుతో సినిమాను నిర్మించారు. సన్ పిక్చర్స్ దీనిని తెరకక్కించే ప్రయత్నం చేశారు. ఇప్పటికే విడుదల చేసిన పోస్టర్స్, టీజర్, ట్రైలర్, సాంగ్స్ కు మంచి స్పందన లభించింది. ఈ ఒక్క మూవీ కోసం రజనీకాంత్ భారీ ఎత్తున రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు టాక్. ఇదిలా ఉండగా రజనీకాంత్ సినీ కెరీర్ లో అత్యధికంగా ఓవర్సీస్ రైట్స్ అమ్ముడు పోయిన ఏకైక చిత్రం కూలీ.
Coolie Movie Updates
ఏకంగా ఈ చిత్రం రైట్స్ రూ. 80 కోట్లకు పైగా అమ్ముడు పోయి సినీ వర్గాలను విస్తు పోయేలా చేసింది. గతంలో రజనీ నటించిన ఏ సినిమా ఇంతటి భారీ ధరకు అమ్ముడు పోలేదు. ఇప్పటికే జైలర్ దుమ్ము రేపింది. బ్లాక్ బస్టర్ గా నిలిచింది. రూ. 1000 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది. ఏ స్టార్ హీరోకు ఇవ్వనంత రెమ్యూనరేషన్ సన్ పిక్చర్స్ రూ. 150 కోట్లకు పైగా రెమ్యూనరేషన్ కింద రజనీకాంత్ కు చెల్లించినట్లు టాక్.
ఇక కూలీ చిత్రం ఇంకా రిలీజ్ కాకుండానే రికార్డులను తిరగ రాస్తోంది. సినిమా విడుదల రోజు హిందీలో తారక్, రోషన్ కలిసి నటించిన వార్ 2 కూడా విడుదల కానుంది. అయినా ఎలాంటి ఎఫెక్టు పడదని అంటున్నారు దర్శకుడు లోకేష్ కనగరాజ్.
Also Read : Indigo Flight Emergency Landing : విమాన జర్నీ ఆందోళనకరం
