Indigo Flight Emergency Landing : విమాన జ‌ర్నీ ఆందోళ‌న‌క‌రం

తృటిలో తప్పిన ప్రమాదం

hellotelugu-indigo

Indigo : హైద‌రాబాద్ – ఇండియాలో రోజు రోజుకు గాలిలో దీపాలుగా మారాయి విమానాల‌లో ప్ర‌యాణాలు. ప్ర‌యాణీకులు అర‌చేతిలో ప్రాణాలు పెట్టుకుని బిక్కుబిక్కుమంటున్నారు. దీంతో ఆందోళనకరంగా మారుతున్నాయి జ‌ర్నీలు. నిన్న రాత్రి తిరుపతి నుండి హైదరాబాద్ కు బయలుదేరిన ఇండిగో విమానంలో సాంకేతిక లోపం చోటు చేసుకుంది. దాదాపు నలభై నిమిషాల పాటు అక్కడక్కడే చక్కర్లు కొట్టింది విమానం.

Indigo Flight Emergency Landing at Shamshabad

తీవ్ర భయకంపితుల‌య్యారు ప్రయాణీకులు . మొత్తానికి సురక్షితంగా తిరుపతి ఎయిర్పోర్ట్ లోనే తిరిగి ల్యాండ్ చేయించారు అధికారులు. అయితే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయలేదు ఇండిగో సంస్థ‌. దీంతో ప్రయాణానికి సిద్ధమై వచ్చిన వారు వెనక్కి వెళ్లాల్సిన పరిస్థితి నెల‌కొంది. విమాన ప్రయాణాలంటేనే భయపడే పరిస్థితి దాపురించింద‌ని వాపోతున్నారు ప్ర‌యాణీకులు.

లాభ నష్టాల లెక్కల వల్ల కావలసినంత మంది సాంకేతిక, నిర్వహణ సిబ్బందిని నియమించడంలో విఫలమవుతున్న ఏరో సంస్థ‌లు. కనీస నిర్వహణ లేకపోవడంతో ప‌దే ప‌దే సాంకేతిక స‌మ‌స్య‌లు చోటు చేసుకుంటున్నాయి.

Also Read : Chinta Mohan Innovative : ద‌ళితులు వ్యాపార‌స్థులుగా ఎద‌గాలి – చింతా మోహ‌న్

Exit mobile version