Coolie : సన్ పిక్చర్స్ భారీ ఖర్చుతో దమ్మున్న దర్శకుడు లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించిన కూలీ చిత్రం దుమ్ము రేపుతోంది. ఆగస్టు 14న ప్రేక్షకుల ముందుకు వచ్చింది ప్రపంచ వ్యాప్తంగా . ఇందులో కీ రోల్ పోషించారు సూపర్ స్టార్ రజనీకాంత్, అక్కినేని నాగార్జున, సత్య రాజ్, ఉపేంద్ర, సోబేర్, శ్రుతి హాసన్ నటించారు. ప్రత్యేక సాంగ్ లో కనిపించింది, మై మరిచి పోయేలా చేసింది పూజా హెగ్డే. ఇప్పటి వరకు కూలీ (Coolie) సినిమా ఏకంగా రూ. 280 కోట్లకు పైగా వసూలు చేసింది. రాబోయే రోజుల్లో మరిన్ని కాసులు కొల్లగొట్టే ఛాన్స్ ఉందని సినీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇదిలా ఉండగా సూపర్ స్టార్ రజనీకాంత్ మరోసారి తన అద్వితీయ బాక్సాఫీస్ శక్తిని నిరూపించుకున్నాడు. ఆయన తాజా విడుదల కూలీ థియేటర్లలో విడుదలైన రెండు రోజుల్లోనే రూ. 200 కోట్ల క్లబ్‌లోకి ప్రవేశించింది, ఇది ట్రేడ్ వర్గాలను సైతం ఆశ్చర్య పరిచింది.
Coolie Movie Sensational Collections
ముందస్తు అంచనాల ప్రకారం ఈ సినిమా రికార్డు స్థాయిలో ప్రారంభోత్సవం జరుపుకోగా, 2వ రోజు కలెక్షన్లు స్వల్పంగా తగ్గాయి. కూలీ రెండవ రోజు ప్రపంచ వ్యాప్తంగా రూ. 765 కోట్లు వసూలు చేసిందని, భారతదేశంలో దాదాపు రూ.40.57 కోట్లు (నికరం) వసూలు చేసిందని నివేదికలు సూచిస్తున్నాయి. దీనితో, ఈ సినిమా రెండు రోజుల మొత్తం ₹220 కోట్లకు చేరుకోవడం విశేషం. ఈ సినిమా అద్భుతమైన ప్రదర్శన బాక్సాఫీస్ వద్ద రజనీకాంత్ ఆధిపత్యాన్ని పునరుద్ఘాటించింది. ఇదిలా ఉండగా కూలీ సక్సెస్ అయినప్పటికీ చిత్ర నిర్మాణ సంస్థ ఇప్పటి వరకు ఎంత వసూలు చేసిందనే దాని గురించి అధికారికంగా ప్రకటన చేయలేదు. మొత్తంగా మరోసారి లోకేష్ కనగరాజ్ తన మార్క్ ను చూపించాడు.
Also Read : Beauty Priyanka Mohan : ప్రియాంక అరుల్ మోహన్ వైరల్


















