దూసుకు పోతున్న స‌హ‌నా స‌హ‌నా సాంగ్

రాజా సాబ్ మూవీ నుంచి మ‌రో పాట హిట్

hellotelugu-RajaSaabSong

హైద‌రాబాద్ : పీపుల్స్ మీడియా ఫ్యాక్ట‌రీ అధినేత టీజీ విశ్వ ప్ర‌సాద్, కీర్తి ప్ర‌సాద్ ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మించిన చిత్రం ది రాజా సాబ్. ఇందులో ప్ర‌ధాన భూమిక పోషించారు పాన్ ఇండియా స్టార్ హీరో ప్ర‌భాస్, ల‌వ్లీ బ్యూటీ నిధి అగ‌ర్వాల్. ఈ సినిమాకు సంబంధించి కీల‌క అప్ డేట్ ఇచ్చారు మూవీ మేక‌ర్స్ . ఇప్ప‌టికే రాజాసాబ్ అనౌన్స్ డేట్ కూడా ఇచ్చేశారు. దీంతో ప్ర‌భాస్ ఫ్యాన్స్ సంతోషంతో ఉబ్బిత‌బ్బిబ్బ‌వుతున్నారు. ఇదిలా ఉండ‌గా ఇప్ప‌టికే విడుద‌ల చేసిన పోస్ట‌ర్స్ , సింగిల్స్ , సాంగ్స్ కు మంచి ఆద‌ర‌ణ ల‌భించింది. తాజాగా రాజా సాబ్ సినిమాకు సంబంధించి మ‌రో పాట‌ను ప్రేక్ష‌కుల ముందుకు తీసుకు వ‌చ్చారు ద‌ర్శ‌కుడు మారుతి.

త‌న సినీ కెరీర్ లో బిగ్ స్టార్ తో సినిమా తీయ‌డం ఇదే తొలిసారి కావ‌డం విశేషం. ఇప్ప‌టికే ప‌లుమార్లు సినిమా డేట్ వాయిదా ప‌డుతూ వ‌చ్చింది. దీంతో డార్లింగ్ ప్ర‌భాస్ ఫ్యాన్స్ తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించారు ప్ర‌ధానంగా ద‌ర్శ‌కుడిపై. దీనిపై ఫుల్ క్లారిటీ ఇచ్చాడు. ప్ర‌భాస్ లాంటి పాన్ ఇండియా స్టార్ తో మూవీ తీసేట‌ప్పుడు చాలా స‌మ‌యం ప‌డుతుంద‌న్నాడు. ఇప్ప‌టికే ఫుల్ రొమాంటిక్, కామెడీ, ఎంట‌ర్ టైన‌ర్, థ్రిల్ల‌ర్, హార‌ర్ మూవీగా రాజా సాబ్ ను తెర‌కెక్కించిన‌ట్లు ప్ర‌క‌టించాడు. తాజాగా రాజా సాబ్ లోని మ‌రో పాట స‌హానా స‌హానా సాంగ్ ను రిలీజ్ చేశారు. దీనికి ఎస్ఎస్ థ‌మ‌న్ స్వ‌రాలు కూర్చ‌గా కృష్ణ కాంత్ పాట‌ను రాశాడు. ప్ర‌స్తుతం ఈ సాంగ్ ట్రెండింగ్ లో ఉంది.

https://www.youtube.com/watch?v=2cF8x6Mhgj4

Exit mobile version