Rahul Ramakrishna : ఒకప్పుడు జర్నలిస్టు, ప్రస్తుత టాలీవుడ్ కమెడియన్ రాహుల్ రామకృష్ణ త్వరలో దర్శకుడిగా మెగా ఫోన్ పట్టనున్నారు. ఆర్టిస్టుగా అయన కెరీర్ బావున్నప్పటికీ ఆయనకు డైరెక్షన్ అంటే ప్యాషన్. ఇదే విషయాన్నీ గతంలోనూ చెప్పారు. అయితే ఇప్పుడు ఆయన మెగా ఫోన్ పట్టే సమయం వచ్చింది. ఈ మేరకు ఆయన ప్రయత్నాలు మొదలుపెట్టారు. తాను దర్శకత్వం వహించనున్న తొలి ప్రాజెక్ట్‌కు సంబంధించి నటీమణుల ఎంపిక ప్రారంభించారు. ఎక్స్ వేదికగా శనివారం ఉదయం ఆయన పోస్ట్ పెట్టారు. ‘‘దర్శకుడిగా నా తొలి ప్రాజెక్ట్.. మీలో ఎవరికైనా ఆసక్తి ఉంటే దయచేసి మీ షోరీల్స్, ఫొటోలను నా మెయిల్‌కు పంపించగలరు’’ అని పేర్కొన్నారు.
Rahul Ramakrishna As a Director
లఘు చిత్రాలతో నటుడిగా మారిన రాహుల్ రామకృష్ణ..‘జయమ్ము నిశ్చయమ్మురా’తో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. ఈ చిత్రానికి డైలాగ్ రైటర్‌గానూ వర్క్ చేశారు. 2017లో విడుదలైన ‘అర్జున్ రెడ్డి’ ఆయనకు గుర్తింపు తెచ్చిపెట్టింది. తదుపరి ‘భరత్ అనే నేను’, ‘చి.ల.సౌ.’, ‘గీత గోవిందం’, ‘కల్కి’, ‘బ్రోచేవారెవరురా’, ‘అల.. వైకుంఠపురములో..’, ‘జాతిరత్నాలు’ చిత్రాల్లో నటించి అలరించారు.
Also Read : Hero Kamal-Thug Life : కమల్ హాసన్ ‘థగ్ లైఫ్’ సినిమా రిలీజ్ కు కళ్లెం వేసిన ధర్మాసనం

















