Rahul Gandhi : న్యూఢిల్లీ – రాహుల్ గాంధీ మోదీ సర్కార్ పై సంచలన ఆరోపణలు చేశారు. లోక్ సభలో ఆపరేషన్ సిందూర్ పై చర్చ జరిగింది. ఈ సందర్బంగా స్పందించిన రాహుల్ సర్కార్ చేతకానితనంపై ప్రశ్నించారు. మోదీ వ్యాపార, వాణిజ్య అవసరాల కోసం ఆపరేషన్ సిందూర్ ను అర్ధాంతరంగా నిలిపి వేశారని ఆరోపించారు. దీంతో భారతీయ సైనిక, వైమానిక దళాలు నిర్వీర్యమై పోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఆపరేషన్ సిందూర్ 22 నిమిషాల్లో ముగిసి పోయిందన్నారు. అర్ధరాత్రి 1.25 గంటల సమయంలో సీజ్ ఫైర్ ప్రస్తావన వచ్చిందన్నారు.
Rahul Gandhi Slams Modi Govt
మోడీ ప్రభుత్వం సీజ్ ఫైర్‌పై పాకిస్థాన్‌కు సమాచారం ఇచ్చిందని ఆరోపించారు రాహుల్ గాంధీ (Rahul Gandhi)…ఎయిర్ స్ట్రైక్‌కు ముందే పాకిస్థాన్‌కు మోడీ ప్రభుత్వం ఇన్ఫర్మేషన్ ఇవ్వడం దారుణమన్నారు. ఇది దేశ ప్రయోజనాలకు భంగకరమన్నారు. ఒక రకంగా చెప్పాలంటే విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జై శంకర్ పూర్తిగా ఫెయిల్ అయ్యారన్నారు. మోడీ ప్రభుత్వం కాల్పుల విరమణ పాటిద్దామని పాకిస్థాన్‌ను అడిగిందన్నారు. మోడీ ప్రభుత్వం పాకిస్థాన్ ముందు పూర్తిగా లొంగి పోయిందన్నారు. సైన్యం చేతులను ప్రభుత్వం కట్టేసిందన్నారు.
పహల్గాంలో టూరిస్టులను అత్యంత కిరాతకంగా కాల్చి చంపడం పట్ల వాపోయారు. పహల్గాం ఉగ్రదాడిని అందరూ ముక్త కంఠంతో ఖండించారని అన్నారు. భార్య చూస్తుండగానే భర్తను కాల్చి చంపారు.. పహల్గాం బాధితులను నేను స్వయంగా కలిశానని చెప్పారు రాహుల్ గాంధీ.. పహల్గాం ఉగ్రదాడి విషయంలో కేంద్రానికి ప్రతిపక్షాలు పూర్తి సహకారం అందించాయన్నారు.. ఆపరేషన్ సిందూర్‌కు ముందు అన్ని పార్టీలు ఏకతాటిపై నిలిచాయన్నారు.. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఏకతాటిపై ఉన్నందుకు గర్వంగా ఉందన్నారు.
Also Read : Modi Fired on Pakistan : పాకిస్తాన్ దాడి చేస్తానంటే ‘రెఢీ’ అన్నా – మోదీ
