అమెరికాతో వాణిజ్య ఒప్పందం వెనుక భారీ కుట్ర

సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేసిన రాహుల్ గాంధీ

helloteelugu-RahulGandhi

న్యూఢిల్లీ : కాంగ్రెస్ పార్టీ అగ్ర నేత‌, ఎంపీ రాహుల్ గాంధీ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు కేంద్ర స‌ర్కార్ పై. భార‌త్, అమెరికా దేశాల మ‌ధ్య కుదిరిన వాణిజ్య ఒప్పందంపై తీవ్ర స్థాయిలో స్పందించారు. దేశ ఆత్మ గౌర‌వాన్ని అమెరికా వ‌ద్ద ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ తాకట్టు పెట్టారంటూ ఆరోపించారు. పార్లమెంట్‌లో విమర్శలు గుప్పించారు. భారతీయ వస్త్రాలపై 18% సుంకం విధించిన అమెరికా ఇదే స‌మ‌యంలో బంగ్లాదేశ్ దేశానికి సున్నా సుంకం వ‌ర్తింప చేయ‌డం విడ్డూరంగా ఉంద‌న్నారు. దీని వెనుక కుట్ర దాగి ఉందంటూ అనుమానాలు వ్య‌క్తం చేశారు రాహుల్ గాందీ. అమెరికా పత్తిని దిగుమతి చేసుకుంటే మన పత్తి రైతులు నాశనమవుతారని, లేకపోతే మన వస్త్ర పరిశ్రమ దెబ్బ తింటుందని ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

కేంద్ర ప్రభుత్వం లక్షలాది కుటుంబాల జీవనోపాధిని పణంగా పెట్టారంటూ మండిప‌డ్డారు రాహుల్ గాంధీ. దేశ ప్రయోజనాలను తాక‌ట్టు పెట్టారంటూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఈ సంద‌ర్బంగా 2024లో ప్రతిపక్ష నాయకుడైనప్పటి నుండి రాహుల్ గాంధీ లోతైన రాజకీయ, మేధో పరివర్తనకు గురయ్యారు. 2026 బడ్జెట్ సమావేశంలో, ఆయన దాదాపు యాభై నిమిషాలు నిరంతరాయంగా ప్రసంగించారు. సంస్థాగత జవాబుదారీతనం, ఎన్నికల సంస్కరణలను పరిశీలించడం, ఓటరు జాబితా సమగ్రత ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్ర ప్రాప్యతపై దృష్టి పెట్టారు.

Exit mobile version