Rahul Gandhi : కొలంబియా : విదేశీ పర్యటనలో బిజీగా ఉన్నారు కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ (Rahul Gandhi). ఆయన తాజాగా అమెరికా లోని నాలుగు దేశాలలో పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా శుక్రవారం ఆయన కొలంబియాకు చేరుకున్నారు. ఇక్కడ భారత దేశానికి చెందిన బజాజ్, హీరో, టీవీఎస్ కంపెనీలకు చెందిన వాహనాల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రపంచ వ్యాప్తంగా భారతీయ కంపెనీలు తయారు చేసిన వాటిని ఆదరించడం తనను మరింత ఆనందానికి గురి చేసిందన్నారు రాహుల్ గాంధీ. ఈ సందర్బంగా ఎక్స్ వేదికగా బజాజ్ పల్సర్ మోటార్ సైకిల్ ముందు ఆయన నిలబడిన పోస్టర్ ను పోస్ట్ చేశారు. ఇది మరింత ఆదరణ పొందుతోంది. సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.
Rahul Gandhi Key Comments
బజాజ్, హీరో , టీవీఎస్ కొలంబియాలో ఇంత బాగా రాణించడాన్ని చూసి గర్వంగా ఉందని ప్రశంసలు కురిపించారు కాంగ్రెస్ ఎంపీ. ఇదే సమయంలో కొలంబియాలోని మెడెల్లిన్‌లోని ఈఐఏ విశ్వ విద్యాలయంలో ‘ది ఫ్యూచర్ ఈజ్ టుడే’ అనే సెమినార్‌లో మాట్లాడారు. మొత్తం ఆర్థిక వ్యవస్థను మూడు లేదా నాలుగు వ్యాపారాలు స్వాధీనం చేసుకోవాలనే ఆలోచనను రాహుల్ గాంధీ తీవ్రంగా విమర్శించారు. చైనాతో పోలిస్తే భారతదేశం చాలా సంక్లిష్టమైన వ్యవస్థను కలిగి ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు. దాని బలాలు పొరుగు దేశం కంటే చాలా భిన్నంగా ఉన్నాయని పేర్కొన్నారు. భారతదేశం చాలా పాత ఆధ్యాత్మిక సంప్రదాయంతో పాటు లోతైన ఆలోచనలతో కూడిన ఆలోచనా వ్యవస్థను కలిగి ఉందని రాహుల్ గాంధీ అన్నారు.
Also Read : UN Security Council Approved : అఫ్గనిస్తాన్ విదేశాంగ మంత్రికి లైన్ క్లియర్
