Rahul Gandhi : బీహార్ – ఈ దేశంలో డెమోక్రసీ ప్రమాదంలో పడిందన్నారు ఎంపీ రాహుల్ గాంధీ. ఈసీకి వ్యతిరేకంగా ఆయన ఆదివారం బీహార్ రాష్ట్రంలోని ససారంలో ఓట్ అధికార్ యాత్రను ప్రారంభించారు. ఇది 16 రోజుల పాటు కొనసాగుతుంది. ఈ సందర్బంగా జరిగిన సభలో రాహుల్ (Rahul Gandhi) కీలక వ్యాఖ్యలు చేశారు. రాజ్యాంగాన్ని బీజేపీ నేతలు భూస్థాపితం చేసే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. లోక్ సభ ఎన్నికలు ముగియగానే ఈసీ మాయ చేసిందని, .కోటి ఓట్లను కొత్తగా సృష్టించిందన్నారు. ఈ సందర్బంగా జరిగిన సభలో ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గేతో పాటు ఆర్ఎల్డీ అగ్ర నేత తేజస్వి యాదవ్ హాజరయ్యారు. ఈ యాత్ర వచ్చే సెప్టెంబర్ 1 వరకు కొనసాగుతుందని చెప్పారు రాహుల్ గాంధీ.
Rahul Gandhi Shocking Comments
తాను ఆధారాలతో సహా ఈసీ చేసిన మోసం గురించి బయట పెట్టడం జరిగిందన్నారు. కానీ ఇదే ఈసీ తాను జారీ చేసిన ఓటర్ల జాబితా గురించి తిరిగి ఆధారాలు సమర్పించాలని కోరడం విడ్డూరంగా ఉందన్నారు. విచిత్రం ఏమిటంటే తాను సమర్పించిన , ప్రస్తావించిన ఓటర్ల జాబితా మొత్తం పూర్తిగా కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చిందేనని స్పష్టం చేశారు. ఇంకా ఎలాంటి సమాచారం తాను ఎందుకు సమర్పించాలని ప్రశ్నించారు రాహుల్ గాంధీ. గతంలో ఎన్నడూ లేనంతగా ఈసీ తన విశ్వసనీయతను కోల్పోయిందన్నారు. ఏకకాలంలో 65 లక్షల మంది ప్రజలు ఎలా చని పోతారంటూ ప్రశ్నించారు. ఆ సోయి ఈసీకి ఉందా అని ప్రశ్నించారు. ఇదంతా కావాలని బీజేపీకి మేలు చేకూర్చేలా చేయడం తప్పితే మరోటి కాదన్నారు.
Also Read : SP Ratna Shocking Comments : 30 గ్రూపుల్లో నూర్ మహమ్మద్ సభ్యుడు : ఎస్పీ రత్న



















