వ్య‌వ‌స్థ‌లు నిర్వీర్యం కేంద్రంపై యుద్దం

మ‌రోసారి దేశ్య వ్యాప్త ఉద్య‌మానికి శ్రీ‌కారం

hellotelugu-Rahulgandhi

ఢిల్లీ : మ‌రోసారి భార‌త్ జోడో యాత్ర‌కు శ్రీ‌కారం చుట్ట‌నున్నారా ఎంపీ రాహుల్ గాంధీ. ఈసారి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ ప‌థ‌కం పేరు మార్చ‌డాన్ని సీరియ‌స్ గా తీసుకుంది ఏఐసీసీ. ఈ మేర‌కు ఢిల్లీలో జ‌రిగిన కీల‌క స‌మావేశంలో సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. జ‌న‌వ‌రి 5వ తేదీ నుంచి దేశ మంత‌టా కాంగ్రెస పార్టీ ఆధ్వ‌ర్యంలో పెద్ద ఎత్తున ఆందోళ‌న‌లు, నిర‌స‌న‌లు, ధ‌ర్నాలు, ర్యాలీలు నిర్వ‌హించాల‌ని పిలుపునిచ్చింది. ఈ మేర‌కు కీల‌క తీర్మానం చేసింది. ఇందులో భాగంగా కాంగ్రెస్ పార్టీ వ‌ర్గాల ద్వారా కీల‌క స‌మాచారం అందింది. ఇప్పటికే భార‌త్ జోడో యాత్ర ద్వారా రాహుల్ గాంధీ సంచ‌ల‌నం సృష్టించారు. ఒకానొక స‌మ‌యంలో కేంద్రం ఆయ‌న యాత్ర‌ను , వ‌చ్చిన స్పంద‌న‌ను చూసి ఉలికి పాటుకు గురైంది. కానీ ఎన్నిక‌ల స‌మ‌యంలో ఆ ప్ర‌భావం చూపించ‌లేద‌ని తేలి పోయింది. దీంతో లైట్ తీసుకున్నారు ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ, అమిత్ చంద్ర షా.

తాజాగా రాహుల్ గాంధీ ఓట్ చోరీ గురించి ప్ర‌జ‌ల‌లోకి వెళ్లాల‌ని నిర్ణ‌యం తీసుకున్నారు. ఈ మేర‌కు ఓ వైపు ఉపాధి హామీ ప‌థ‌కం పేరు మార్చ‌డంపై ఆందోళన కొన‌సాగుతుండ‌గానే తాను కూడా భార‌త్ జోడో యాత్ర 0.3 చేప‌ట్టాల‌ని నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు స‌మాచారం. ఇందుకు సంబంధించి ఏర్పాట్లు కూడా చేయాల‌ని కూడా ఆదేశించిన‌ట్లు తెలిసింది. రాహుల్ గాంధీ ఇటీవ‌ల సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేస్తూ వ‌స్తున్నారు కేంద్ర ఎన్నిక‌ల సంఘంపై. స‌ర్ పేరుతో ఉన్న ఓట్ల‌ను తొల‌గిస్తున్నార‌ని, ఇందుకు సంబంధించి త‌మ వ‌ద్ద ప‌క్కా ఆధారాలు ఉన్నాయ‌ని స్ప‌ష్టం చేశారు. అయినా ఈసీ త‌న‌పై కేసు న‌మోదు చేసింది. తాను భ‌య‌ప‌డే ప్ర‌స‌క్తి లేద‌ని ప్ర‌క‌టించాడు రాహుల్ గాంధీ.

Exit mobile version