భార‌తీయ జ‌న‌తా పార్టీలో చేరిన రాఘ‌వ్ చ‌ద్దా

ఆమ్ ఆద్మీ పార్టీకి కోలుకోలేని షాకిచ్చిన ఎంపీ

hellotelugu-RaghavChadha

న్యూఢిల్లీ : అంతా అనుకున్న‌ట్టే జ‌రిగింది. ఇప్ప‌టికే ఆప్ మాజీ సీఎం చేసిన వ్యాఖ్య‌లు, ఆరోప‌ణ‌లు నిజం అయ్యాయి. త‌ను బీజేపీలోకి వెళ్లేందుకే ప్ర‌ధాన , ప్ర‌జ‌ల‌కు సంబంధించిన స‌మ‌స్య‌ల‌ను పార్ల‌మెంట్ లో ప్ర‌స్తావించ‌డం లేద‌ని అన్నారు. దీనిని నిజం చేస్తూ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు ఎంపీ రాఘ‌వ్ చ‌ద్దా. త‌న‌తో పాటు మ‌రో ఆరుగురు ఆప్ కు చెందిన ఎంపీలు రాజీనామా చేస్తున్న‌ట్లు వెల్ల‌డించారు. ఆప్ కు కోలుకోలేని షాక్ ఇచ్చారు. తాను చెప్పిన‌ట్టుగానే పార్టీకి గుడ్ బై చెప్పిన వెంట‌నే శ‌నివారం అధికారికంగా న్యూఢిల్లీలోని భార‌తీయ జ‌న‌తా పార్టీ కార్యాల‌యంలో ఆ పార్టీ జాతీయ అధ్య‌క్షుడు నితిన్ న‌బిన్ స‌మ‌క్షంలో కాషాయ కండువా క‌ప్పుకున్నాడు రాఘ‌వ్ చ‌ద్దా. త‌న‌తో పాటు మ‌రికొంద‌రు ఆప్ ఎంపీలు సైతం బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు.

పంజాబ్ నుండి రాజ్యసభ సభ్యుడిగా ఉన్న ఆయన, తనతో పాటు, ఎగువ సభలో ఉన్న తమ పార్టీ సభ్యులలో మూడింట రెండు వంతుల మంది కూడా భారతీయ జనతా పార్టీలో విలీనమవుతున్నారని తెలిపారు. అనంత‌రం సందీప్ పాఠక్, అశోక్ మిట్టల్‌లతో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాజ్యసభలో ఆప్ కి చెందిన మూడింట రెండు వంతుల మంది సభ్యులమైన తాము, భారత రాజ్యాంగ నిబంధనలను వినియోగించుకుని బీజేపీలో విలీనం కావాల‌ని తాము నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు చెప్పారు. ఈ సంద‌ర్బంగా ఆప్ ని వీడిన స్వాతి మాలివాల్ గ‌తంలో అర‌వింద్ కేజ్రీవాల్ నివాసంలో త‌న‌పై జ‌రిగిన దాడిని గుర్తు చేసుకున్నారు.

Exit mobile version