Raashii Khanna : గబ్బర్ సింగ్ మూవీ బ్లాక్ బస్టర్ తర్వాత వస్తున్న కాంబినేషన్ మూవీ ఉస్తాద్ భగత్ సింగ్. షూటింగ్ శర వేగంగా కొనసాగుతోంది. ఈ ఏడాది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఇప్పటికే తన సరసన అందాల భామ శ్రీలీల నటిస్తున్నట్లు ప్రకటించాడు దర్శకుడు హరీశ్ శంకర్. ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ ఏడాది తను నటించిన సినిమాలలో హరి హర వీరమల్లు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మిక్స్ డ్ స్పందన లభించింది. దర్శకుడు సుజిత్ దర్శకత్వంలో ఓజీ రాబోతోంది. ప్రస్తుతం చాలా గ్యాప్ తర్వాత హరీశ్ శంకర్ దర్శకత్వం వహిస్తుండడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
Raashii Khanna in Ustaad Bhagat Singh Movie
ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా షూటింగ్ కొనసాగుతోంది. ఈ సినిమాకు సంబంధించి కీలక అప్ డేట్ వచ్చింది. మరో హీరోయిన్ గా రాశీ ఖన్నా (Raashii Khanna) ఇందులో జాయిన్ అవుతోంది. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు దర్శకుడు హరీశ్ శంకర్. స్పెషల్ స్టోరీ కూడా జత చేశారు. తాజాగా పోస్టర్ ను రిలీజ్ చేశారు. తను పూర్తిగా స్టన్నింగ్ లుక్ తో మెరిసి పోవడం విశేషం. తన పాత్ర పేరు శ్లోకా అని ప్రకటించాడు డైరెక్టర్.
తనతో పాటు శ్రీలీల , పవన్ కళ్యాణ్ లు ఎలాంటి పాత్రలలో నటిస్తున్నారనే దానిపై ఉత్కంఠ నెలకొంది అభిమానులలో. పక్కాగా సినిమా సక్సెస్ అయ్యేలా , పవన్ కళ్యాణ్ కు మరో బ్లాక్ బస్టర్ ఇవ్వాలనే కంకణం కట్టుకున్నారు . రాశీ ఖన్నా ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ లో ఎంటర్ అయ్యారని తెలిపాడు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై ఈ సినిమాను నిర్మిస్తున్నారు. గబ్బర్ సింగ్ తో మ్యూజిక్ తో మ్యాజిక్ చేసిన దేవిశ్రీ ప్రసాద్ ఈసారి కూడా తన సత్తా ఏమిటో చూపించాలని ట్రై చేస్తున్నట్లు టాక్.
Also Read : Siima Awards Sensational : సైమా అవార్డుల నామినేషన్లలో పుష్ప2 హవా
