Siima Awards Sensational : సైమా అవార్డుల నామినేష‌న్ల‌లో పుష్ప‌2 హ‌వా

అవార్డుల కార్య‌క్ర‌మానికి రంగం సిద్దం

Hello Telugu - Siima Awards Sensational

Hello Telugu - Siima Awards Sensational

Siima Awards : ఈసారి అంద‌రి క‌ళ్లు సైమా అవార్డుల‌పైనే ఉన్నాయి. దీనికి కార‌ణం అత్యంత వైభ‌వోపేతంగా నిర్వ‌హించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈసారి దుబాయ్ వేదిక‌గా కార్య‌క్ర‌మం జ‌ర‌గ‌నుంది. ప్ర‌త్యేకించి ద‌క్షిణాదిన విడుద‌లైన సినిమాలు, వాటిలో ప్ర‌తిభా నైపుణ్యాల‌ను ప్ర‌ద‌ర్శించే వారికి సౌత్ ఇండియ‌న్ ఇంట‌ర్నేష‌న‌ల్ మూవీ అవార్స్ 2025 (సైమా) పేరుతో ఇస్తున్నారు. ఇందుకు రంగం రెడీ అయ్యింది. గ‌త సంవ‌త్స‌రం బాక్సాఫీస్ వ‌ద్ద బిగ్ స‌క్సెస్ అయిన సినిమాల‌ను వివిధ విభాగాల‌లో నామినేష‌న్ ద‌క్కించు కోవ‌డం విశేషం.

Siima Awards Nomination – Pushpa 2

ఇందులో ప్ర‌ధానంగా తమిళం, మ‌ల‌యాళం, తెలుగు, క‌న్న‌డ మూవీస్ ఉన్నాయి. ఇందుకు సంబంధించి నామినేష‌న్స్ అయిన సినిమాల జాబితాను అధికారికంగా సైమా అవార్డ్స్ (Siima Awards) క‌మిటీ ప్ర‌క‌టించింది. ఇక ఈసారి సైమా నామినేష‌న్ల ప‌రంగా చూస్తే ద‌మ్మున్న ద‌ర్శ‌కుడు సుకుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన అల్లు అర్జున్, నేష‌న‌ల్ క్ర‌ష్ ర‌ష్మిక మంద‌న్నా క‌లిసి న‌టించిన చిత్రం పుష్ప 2 చిత్రం విచిత్రంగా 11 నామినేష‌న్ల‌తో అగ్ర భాగాన నిలిచింది. ఈ మూవీ ఏకంగా రూ. 1867 కోట్లు వ‌సూలు చేసింది.రికార్డ్ తిర‌గ రాసింది.

డార్లింగ్ ప్ర‌భాస్ న‌టంచిన క‌ల్కి 2898 ఏడీ మూవీ 10 నామినేష‌న్స్ పొందింది. 2వ ప్లేస్ లో నిలిచింది. దీనిని ద‌ర్శ‌కుడు నాగ్ అశ్విన్ తీశాడు . దీంత పాటు తేజ స‌జ్జా తీసిన హ‌నుమాన్ కూడా 10 కేట‌గిరీల‌లో ఉండ‌డం విస్తు పోయేలా చ‌సింది. ఈ మూడు చిత్రాలు 2024లో టాప్ లో నిలిచాయి.

ఇక త‌మిళ సినిమా ప‌రంగా శివ కార్తికేయ‌న్ అమ‌ర‌న్ 13 నామినేష‌న్ల‌లో ఉండ‌గా ల‌బ్బ‌ర్ పందు 8 , వాళ్లై 7 నామినేష‌న్స్ ద‌క్కించుకున్నాయి. క‌న్న‌డ సినిమా రంగం నుంచి భీమా 9 నామినేష‌న్లు, కృష్ణ ప్ర‌ణ‌య సంఖి 9 , ఇబ్బ‌ని త‌బ్బిడ ఇలియాలి 7 కేట‌గిరీల‌లో పోటీ ఇవ్వ‌నున్నాయి. మ‌ల‌యాళం సినిమాల ప‌రంగా చూస్తే పృథ్వీ రాజ్ సుకుమార్ ఆడు జీవితం 10 నామినేష‌న్స్ తో టాప్ లో కొన‌సాగుతోంది. ఏఆర్ఎం 9, ఆవేశం 8 నామినేష‌న్లు కైవ‌సం చేసుకున్నాయి. సెప్టెంబ‌ర్ 5, 6 తేదీల‌లో ఈ కార్య‌క్ర‌మం దుబాయ్ వేదిక‌గా జ‌ర‌గ‌నుంది.

Also Read : Supreme Court Shocking : బాంబే హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టు స్టే

Exit mobile version