అమరావతి : ఏపీ రాష్ట్ర డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజుపై నిప్పులు చెరిగారు మాజీ సీఐడీ ఉన్నతాధికారి సునీల్ కుమార్. ఆయన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. గౌడి గేదె లాగా పెరిగావ్.. సంస్కారం లేదా..? మీ అమ్మనాన్న నేర్పించ లేదా? అని ప్రశ్నించారు. గోదావరి జిల్లాలో పనిచేసే వాళ్లను కూడా బాబు అని పిలుస్తాం అన్నారు. ఆ విషయం తెలుసుకోకుండా నోటికి వచ్చినట్లు ఎలా పడితే అలా మాట్లాడితే ఎలా అని భగ్గుమన్నారు. వాడు, వీడు ఆ కోటు.. నీకేంటి నేను వేసుకుంటే.. నీ సొమ్ములతో ఏమైనా కొని ఇచ్చావా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు సునీల్ కుమార్.
పొద్దున లేగిస్తే బ్యాంకులను మోసం చేస్తే గాని బ్రతక లేవు నువ్వు. ఆ డబ్బులు లేకపోతే నీకు బ్రతుకు లేదంటూ భగ్గుమన్నారు. ఎంగిలి మెతుకులు తినే కుక్కలను తయారు చేసుకున్నావ్.. వాళ్లను పట్టించుకోను అంటూ సీరియస్ కామెంట్స్ చేశారు . పిచ్చి ఛానల్స్ ను ఎవడు పట్టించుకోడు.. సంస్కారం, హద్దులు దాటి మాట్లాడితే ఎవడు పడి ఉండడని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు మాజీ ఐపీఎస్ ఆఫీసర్. మేము కూడా అనగలం..వాడు వీడు అని.. నువ్వెంత నీ బ్రతుకెంత.. నువ్వా నన్ను అనేవాడివి..ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడు..ఈ సారి మాట్లాడేటప్పుడు.. లేదంటే నేను తిట్టవలసి ఉంటుందని వార్నింగ్ ఇచ్చారు సునీల్ కుమార్.
