Chiranjeevi : అందరి కళ్లు ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి, నయనతార నటిస్తున్న శివ శంకర ప్రసాద్ గారుపై ఉంది. ఈ సినిమాకు సంబంధించి షూటింగ్ శర వేగంగా కొనసాగుతోంది. దీనికి సక్సెస్ ఫుల్ దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తుండడంతో అంచనాలు మరింత పెరిగాయి. తన పుట్టిన రోజు సందర్బంగా రిలీజ్ చేసిన వీడియో సోషల్ మీడియాను షేక్ చేసింది. తాజాగా నయనతారతో చిరంజీవి (Chiranjeevi) కీలకమైన పాట చిత్రీకరణ చేస్తున్నారు దర్శకుడు. ఈ సమయంలో అక్కడే తళుక్కున మెరిశారు దర్శకుడు పూరీ జగన్నాథ్, నటుడు విజయ్ సేతుపతి. ఈ ఇద్దరి కాంబినేషన్ లో పాన్ ఇండియా మూవీ రాబోతోంది.
Chiranjeevi-Sethupathi Movie Updates
అటు మన శంకర వర ప్రసాద్ , పూరీ టీం హైదరాబాద్ లో కలుసుకోవడం విశేషం. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు వైరల్ గా మారాయి. ఇరు బృందాలను ఉల్లాసంగా ముంచెత్తిన ఆనందకరమైన క్షణంలో, ఇద్దరు పవర్‌హౌస్ ప్రదర్శకులు మెగాస్టార్ చిరంజీవి, మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి హైదరాబాద్ ఫిల్మ్ స్టూడియోలో ఒకరినొకరు కలుసుకున్నారు.
అదే కాంప్లెక్స్‌లోని సమీపంలోని యూనిట్‌లో, విజయ్ సేతుపతి పూరి జగన్నాధ్‌తో కలిసి రాబోయే హై-ఆక్టేన్ డ్రామా కోసం కీలకమైన భాగాలను చిత్రీకరిస్తున్నాడు, ఇందులో టబు కూడా కీలక పాత్రలో నటిస్తోంది. వీరు కలుసు కోవడం పట్ల అభిమానులు తెగ ముచ్చట పడుతున్నారు. తమ ఆనందాన్ని పంచుకుంటున్నారు. ఇప్పటికే సంక్రాంతికి వస్తున్నాం చిత్రంతో బ్లాక్ బస్టర్ ఇచ్చిన అనిల్ రావిపూడి మరో బిగ్ సక్సెస్ ఇవ్వాలనే కసితో చిరంజీవితో మూవీ తీస్తున్నాడు.
Also Read : Samantha Interesting Comments : గతంలో కంటే ఇప్పుడు సంతోషంగా ఉన్నా



















