పంజాబ్ కెప్టెన్ శ్రేయ‌స్ అయ్య‌ర్ కు జ‌రిమానా

స్లో ఓవ‌ర్ రేట్ కు గాను రూ. 12 ల‌క్ష‌లు ఫైన్

hellotelugu-ShreyasIyer

ముల్లాన్ పూర్ : ఐపీఎల్ 2026 మెగా టోర్నీలో భాగంగా తొలి మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ ఎలెవ‌న్ మూడు వికెట్ల తేడాతో గెలుపొందింది. నిన్న శుభ్ మ‌న్ గిల్ సార‌థ్యంలోని గుజ‌రాత్ టైటాన్స్ తో మ్యాచ్ జ‌రిగింది. టాస్ గెలిచిన పంజాబ్ కెప్టెన్ శ్రేయాస్ అయ్య‌ర్ ముందు ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. దీంతో ముందుగా బ‌రిలోకి దిగిన గుజ‌రాత్ టైటాన్స్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 6 వికెట్లు కోల్పోయి 163 ర‌న్స్ చేశారు. అనంత‌రం పంజాబ్ కింగ్స్ ఎలెవ‌న్ 7 వికెట్లు కోల్పోయి నిర్దేశించిన ల‌క్ష్యాన్ని19.1 ఓవ‌ర్ల‌లో పూర్తి చేసింది. విజ‌యం సాధించిన‌ప్ప‌టికీ కెప్టెన్ అయ్య‌ర్ కు షాక్ త‌గిలింది.

ఐపీఎల్ క్ర‌మ‌శిక్ష‌ణ క‌మిటీ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఈ మేర‌కు స్లో ఓవ‌ర్ రేట్ చేసినందుకు గాను పంజాబ్ కెప్టెన్ కు రూ. 12 ల‌క్ష‌ల జ‌రిమానా విధించింది. ఈ జరిమానా ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిలోని ఆర్టికల్ 2.22 పరిధిలోకి వస్తుందని తెలిపింది. ఇది కనీస ఓవర్-రేట్ నేరాలకు సంబంధించినది. ఈ సీజన్‌లో నెమ్మదైన ఓవర్ రేట్‌కు గాను జరిమానా విధించబడిన మొదటి కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ అయ్యాడు. ఇక మ్యాచ్ ప‌రంగా చూస్తే పంజాబ్ త‌ర‌పున అద్భుతంగా ఆడారు కూప‌ర్ కాన‌లీ 44 బంతుల్లో 72 ర‌న్స్ చేసి నాటౌట్ గా నిలిచాడు. ప్ర‌భ్ సింగ్ మాన్ సైతం దుమ్ము రేపాడు. గుజ‌రాత్ టైటాన్స్ బౌల‌ర్ల‌కు చుక్క‌లు చూపించారు. దీంతో పంజాబ్ కింగ్స్ ఎలెవ‌న్ బోణీ కొట్టింది.

Exit mobile version