Producer SKN : ప్రముఖ నిర్మాత ఎస్కేఎన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుతం గతంలో కంటే ఇప్పుడు ట్రెండ్ మారిందన్నాడు. గతంలో హీరో, హీరోయిన్లు, దర్శకులు, నిర్మాతలు ఎవరనే దానిపై సినిమాలు ఆధారపడి నడిచేవని కానీ అలా ఇప్పుడు లేదన్నారు. తన పుట్టిన రోజు జూలై 7. ఈ సందర్భంగా ఇవాళ చిట్ చాట్ చేశాడు నిర్మాత. కథ బాగుంటేనే జనం ఆదరిస్తున్నారని, లేకుంటే ఎంత భారీగా ఖర్చు చేసి తీసినా పట్టించు కోవడం లేదన్నారు ఎస్కేఎన్. ప్రధానంగా ప్రేమ కథలను డిఫరెంట్ గా తీస్తే వర్కవుట్ అవుతోందని చెప్పారు. ఇందులో ఎలాంటి అనుమానం అక్కర్లేదన్నాడు. తను తీసిన బేబీ బిగ్ సక్సెస్ అయ్యింది. దీనిని హిందీలో రీ మేక్ చేస్తున్నాడు. తాజాగా కిరణ్ అబ్బవరంతో చెన్నై లవ్ స్టోరీ తీశాడు.
Producer SKN Comments
తన మనసులోని మాట పంచుకున్నాడు ఎస్కేఎన్ (Producer SKN). తాను మొదటగా కెరీర్ ను పీఆర్ఓగా స్టార్ట్ చేశానని తెలిపాడు. ఎల్లప్పుడూ మెగా కుటుంబానికి వీరాభిమానినని చెప్పాడు. ఆ ప్రేమనే తనను పరిశ్రమలోకి వచ్చేలా చేసిందన్నాడు. రాయడం, చదవడం పనిగా పెట్టుకున్నానని, అదే తనను స్క్రిప్ట్ రైటర్ గా మారేందుకు దోహదం చేసిందని తెలిపాడు. తనను నిర్మాతగా మారేలా చేసింది మాత్రం దర్శకుడు మారుతి అని చెప్పాడు ఎస్కేఎన్. ఇదే సమయంలో మారుతి దర్శకత్వంతో కలిసి ఈరోజుల్లో అనే సినిమాను తొలిసారిగా నిర్మించడం జరిగిందని తెలిపాడు.
Also Read : Beauty Rashmika Mandanna : పని గంటల విషయంలో ఎవరి ఇష్టం వారిదే



















