Producer Naga Vamsi : హైదరాబాద్ – తాను నిర్మించిన కింగ్ డమ్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు నిర్మాత నాగవంశీ. ఏ సినిమాకు వంద శాతం చప్పట్లు అనేవి రావన్నారు. సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పాజిటివ్ టాక్ వచ్చినా కొంత మంది విశ్లేషకులు వ్యతిరేకంగా సమీక్షలు రాయడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. సినిమా అన్నది ఎవరినీ పూర్తిగా సంతృప్తి పర్చదని స్పష్టం చేశారు. ఇప్పుడు విడుదలైన సినిమాలలో తమ సినిమానే టాప్ లో కొనసాగుతోందన్నారు. విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ హాలీవుడ్ స్టాండర్డ్ సినిమా పేర్కొన్నారు. అయితే నిర్మాత సంచలన వ్యాఖ్యలు చేశారు. సినిమా గనుక నచ్చక పోతే ఫోన్ చేసి తిట్టొచ్చని ఆఫర్ కూడా ఇచ్చాడు. ఇప్పటి వరకు ఏ నిర్మాత ఇలాంటి ఆఫర్ ఇవ్వలేదు.
Producer Naga Vamsi Key Comments on Kingdom Movie Talk
కాగా కింగ్‌డమ్ విడుదలైన మొదటి రోజే బాక్సాఫీస్ వద్ద రూ. 15 కోట్లు వసూలు చేసింది. ఈసందర్బంగా మీడియాతో మాట్లాడాడు నాగవంశీ (Producer Naga Vamsi). సినిమా రెండవ భాగం కొంచెం వెనుకబడి ఉందని సమీక్షకులు చెబుతున్నారు, కానీ ఇది ప్రతి సినిమాకు సాధారణమని పేర్కొన్నారు. సెకండ్ హాఫ్ హై స్టాండర్డ్స్‌తో వచ్చిందని చెప్పారు. టెక్నికల్‌గా చూస్తే ఇది హాలీవుడ్ రేంజ్ స్టాండర్డ్స్‌తో సరిపోతుందన్నారు. సినిమా పరంగా చూస్తే విజయ్ దేవరకొండ, సత్య దేవ్ ల నటనను ప్రశంసిస్తున్నారు ఫ్యాన్స్. గతంలో జెర్సీ మూవీతో సెన్సేషన్ క్రియేట్ చేసిన దర్శకుడు గౌతమ్ తిన్నసూరి కింగ్ డమ్ ను తీశాడు. మొత్తంగా తాజాగా నిర్మాత నాగవంశీ చేసిన కామెంట్స్ ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
Also Read : Rashmika – Kingdom Success : నువ్వేంటో నాకు బాగా తెలుసు : రష్మిక మందన్నా



















