Hero Manchu Vishnu-Dil Raju : మంచు విష్ణు నిర్ణ‌యం దిల్ రాజు సంతోషం

న‌కిలీ రివ్యూస్ పై మ‌రోసారి కీల‌క కామెంట్స్

Hello Telugu - Hero Manchu Vishnu-Dil Raju

Hello Telugu - Hero Manchu Vishnu-Dil Raju

Manchu Vishnu : ప్ర‌ముఖ నిర్మాత దిల్ రాజు న‌టుడు విష్ణు మంచును ప్ర‌త్యేకంగా అభినందించారు. సినిమాలు, వెబ్ సీరీస్ ల‌కు సంబంధించి వ‌స్తున్న నెగ‌టివ్ రివ్యూస్ పై సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకోవ‌డం ప‌ట్ల స్పందించారు నిర్మాత‌. తాను దీనిని స్వాగ‌తిస్తున్నాన‌ని అన్నారు. మంచు మోహ‌న్ బాబు స‌మ‌ర్ప‌ణ‌లో విడుద‌ల చేసిన క‌న్న‌ప్ప రిలీజ్ అయ్యింది. భారీ ఆద‌ర‌ణ చూర‌గొంది. ఈ సినిమా రిలీజ్ సంద‌ర్భంగా మంచు విష్ణు (Manchu Vishnu) కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. దీనిని తాను స్వాగ‌తిస్తున్న‌ట్లు తెలిపారు దిల్ రాజు.

Manchu Vishnu Decision

ఈ నిర్ణ‌యం చాలా మందికి మేలు చేకూర్చేలా చేస్తుంద‌న్నారు. ప‌నిగ‌ట్టుకుని సినిమాల‌పై స‌మీక్ష‌ల పేరుతో బ‌ద్నాం చేయ‌డం ప‌ట్ల తీవ్ర ఆవేద‌న వ్య‌క్తం చేశారు. త‌న నిర్ణ‌యం తమ‌కే కాదు సినీ ఇండ‌స్ట్రీకి మేలు చేకూరుతుంద‌న్నారు దిల్ రాజు.

ఇదిలా ఉండ‌గా జూన్ 27న ప్ర‌పంచ వ్యాప్తంగా రిలీజ్ చేశారు క‌న్న‌ప్ప మూవీని. విడుద‌ల కంటే ముందు రోజుల‌కు కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు మంచు విష్ణు. సోష‌ల్ మీడియా వేదిక‌గా ఎవ‌రైనా త‌మ సినిమాను ల‌క్ష్యంగా చేసుకుని ఉద్దేశ పూర్వ‌కంగా ప్ర‌తికూల ట్రోలింగ్, న‌కిలీ స‌మీక్ష‌లు లేదా వ్య‌క్తిగ‌త దాడులు జ‌రిగితే క‌ఠిన చ‌ర్య‌లు త‌ప్ప‌వంటూ హెచ్చ‌రించారు.

ఇంత‌కు ముందు సినిమాల‌కు సంబంధించి ఇలాంటి ప్ర‌క‌ట‌న‌లు ఎవ‌రూ చేయ‌క పోవ‌డం విశేషం. కాగా దిల్ రాజు నిర్మించిన తాజా చిత్రం త‌మ్ముడు. ఈనెల 4న విడుద‌ల కానుంది ప్ర‌పంచ వ్యాప్తంగా. దీనికి వేణు శ్రీ‌రామ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఇందులో నితిన్ రెడ్డితో పాటు ప్ర‌ముఖ న‌టి ల‌య కీల‌క పాత్రలు పోషించారు.

Also Read : Hero Pawan-Hari Hara Veera Mallu : ప‌వ‌న్ హ‌రి హ‌ర వీర‌మ‌ల్లు ట్రైల‌ర్ రిలీజ్

Exit mobile version