నా వ‌ద్ద డ‌బ్బులు లేవ‌ని ప్రియురాలు వ‌దిలేసింది

సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన న‌టుడు విశ్వ‌క్ సేన్

hellotelugu-VishwakSen

హైద‌రాబాద్ : హీరో విశ్వ‌క్ సేన్ తీవ్ర భావోద్వేగానికి లోన‌య్యాడు. తాను త‌న జీవితంలో ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి ఏక‌రువు పెట్టాడు. సినీ పరిశ్రమలోకి అడుగు పెట్టే ముందు తాను పడిన కష్టాలను, ఎదుర్కొన్న చేదు అనుభవాలను గుర్తు చేసుకున్నాడు. కేవలం 16 ఏళ్ల వయసులోనే ముంబై లోని ప్రఖ్యాత అనుపమ్ ఖేర్ ఫిల్మ్ స్కూల్‌లో నటనలో శిక్షణ తీసుకున్నట్లు చెప్పాడు. 17 ఏళ్ల నుంచే హైదరాబాద్ కృష్ణానగర్‌లోని ఆఫీసుల చుట్టూ ఆడిషన్ల కోసం తిరిగినట్లు తెలిపాడు. చాలా ఇబ్బందులు ప‌డ్డానంటూ వాపోయాడు. దొరికిన చిన్న పాత్రల్లోనే తన ప్రతిభను నిరూపించుకుని పెద్ద సినిమాల్లో అవకాశాలు దక్కించు కోవాలనే లక్ష్యంతో అడుగులు వేసినట్లు వెల్ల‌డించాడు.

21 ఏళ్ల వయసులో తన వద్ద డబ్బులు లేవనే కారణంతో తన గర్ల్‌ఫ్రెండ్ వదిలేసి వెళ్లి పోయిందని ఆవేదన వ్యక్తం చేశాడు . జాగా జరిగిన ‘ఈ నగరానికి ఏమైంది’ (ENE) సక్సెస్ మీట్‌లో తన జీవిత ప్రయాణం గురించి వివ‌రాలు తెలిపాడు విశ్వ‌క్ సేన్. కెరీర్ ఆరంభంలోని కష్టాల గురించి భావోద్వేగంగా పంచుకోవ‌డం మ‌రింత చ‌ర్చ‌కు దారితీసేలా చేసింది. ప్ర‌తి నటుడి స‌క్సెస్ వెనుక ఎన్నో తెలియ‌ని క‌థ‌లు దాగి ఉంటాయ‌ని ఈ సంద‌ర్బంగా పేర్కొన్నాడు న‌టుడు. సినిమా రంగం అనేది ఎంద‌రికో నీడ‌ను ఇస్తుంద‌ని, కానీ క‌ష్ట‌ప‌డితే, టాలెంట్ నిరూపించుకుంటే ఇక్క‌డ మంచి భ‌విష్య‌త్తు ఉంటుంద‌ని తెలిపాడు విశ్వ‌క్ సేన్. ఇదిలా ఉండ‌గా ప్ర‌స్తుతం న‌టుడు చేసిన వ్యాఖ్య‌లు సంచ‌ల‌నంగా మారాయి. సోష‌ల్ మీడియాలో ట్రెండింగ్ లో కొన‌సాగుతున్నాయి.

Exit mobile version