Priyanka Mohan : సోషల్ మీడియాను షేక్ చేస్తోంది ప్రముఖ నటి ప్రియాంక అరుల్ మోహన్ (Priyanka Mohan). తను ప్రస్తుతం సుజిత్ దర్శకత్వం వహిస్తున్న డీవీవీ దానయ్య ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఓజీ సినిమాలో కీలక రోల్ పోషిస్తోంది. ఇందులో ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరో పాత్రను పోషిస్తున్నారు. ఆయన నుంచి ఈ ఏడాది 2025లో మూడు సినిమాలు ప్రేక్షకులను అలరించే పనిలో పడ్డాయి. ఇప్పటికే ఎంఎం రత్నం నిర్మించిన జ్యోతికృష్ణ దర్శకత్వం వహించిన హరి హర వీరమల్లు విడుదలైంది. మిశ్రమ స్పందన లభించింది. ఇక త్వరలోనే ఓజీ రాబబోతోంది ప్రేక్షకుల ముందుకు. ఈ సినిమాకు సంబంధించి కీలక అప్ డేట్ వచ్చేసింది. సినిమా షూటింగ్ పూర్తయిందని, త్వరలోనే ఓజీని విడుదల చేస్తామని ప్రకటించారు మూవీ మేకర్స్.
Actress Priyanka Mohan OG Movie Updates
ఇదే సమయంలో డిఫరెంట్ సాంగ్ ను రిలీజ్ చేశారు. దీనికి ఎస్ఎస్ థమన్ స్వర కల్పన చేశారు. ఇది యూట్యూబ్ లో దుమ్ము రేపుతోంది. మరో వైపు ఓజీ నుంచి ప్రియాంక అరుల్ మోహన్ న్యూ లుక్ వచ్చేసింది. ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది ఈ ముద్దుగుమ్మ. ఇందులో కన్మణి పాత్ర . యువతీ యువకులను ఆకట్టుకుంటోంది ఈ పోస్టర్. లక్షలాది మంది లైక్ లతో హోరెత్తిస్తున్నారు. దీంతో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కెవ్వు కేక అంటున్నారు ప్రియాంకను చూసి. పవన్ తో పర్ ఫెక్ట్ జోడి అంటూ పేర్కొంటున్నారు. త్వరలోనే రెండో సాంగ్ ను విడుదల చేస్తారు. త్వరలో ప్రోమో కూడా రిలీజ్ చేస్తామని ప్రకటించారు మూవీ మేకర్స్.
Also Read : BSC Agriculture Admissions Interesting : బీఎస్సీ అగ్రికల్చర్ అడ్మిషన్స్ షురూ


















