న్యూఢిల్లీ : దేశ రాజధానిలో ఆశ్చర్యకరమైన సన్నివేశం చోటు చేసుకుంది. పార్లమెంట్ సాక్షిగా తాను ప్రాతినిధ్యం వహిస్తున్న వాయనాడు లోక్ సభ నియోజకవర్గంలో చోటు చేసుకున్న ప్రధాన సమస్యలను ప్రస్తావించారు. ఈ సందర్బంగా తనకు టైం ఇవ్వడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రధానంగా ఆమె కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీపై సెటైర్ వేశారు. దీంతో ఆయన తక్షణమే స్పందించారు. ప్రియాంక గాంధీ తన నివాసానికి వస్తానంటే తాను ఎలా వద్దానంటూ అప్పటికప్పుడు తిరుగు సమాధానం ఇచ్చారు. దీంతో సభలో సభ్యులంతా ఆశ్చర్యానికి లోనయ్యారు. నిన్నటి దాకా ప్రతిపక్షం వర్సెస్ అధికారపక్షం మధ్య మాటల యుద్దం నడిచింది.
దీంతో ప్రియాంక గాంధీ నేరుగా కేంద్ర మంత్రి ఆఫీసుకు వెళ్లారు. ఆయన ఆమెకు గ్రాండ్ వెల్ కమ్ ఇచ్చారు. ఈ సందర్బంగా తన నియోజకవర్గంలో పేరుకు పోయిన సమస్యలను ఏకరువు పెట్టారు. తక్షణమే రహదారుల నిర్మాణాల కోసం ప్రతిపాదనలు పంపించారని, వెంటనే నిధులను మంజూరు చేయాలని కోరారు. ఇందుకు సంబంధించిన వినతి పత్రం కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి అందజేశారు. ఆయన తక్షణమే సంబంధిత ఉన్నతాధికారులను పిలిపించారు. మేడం పేర్కొన్న నిధులకు సంబంధించి త్వరగా పూర్తి అయ్యేలా చూడాలని ఆదేశించారు. ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలను షేక్ చేస్తున్నాయి. మొత్తంగా తాను అనుకున్న పనిని నెరవేర్చుకున్నారు ప్రియాంక గాంధీ.
