టాలీవుడ్ లో తెగ చక్కర్లు కొడుతోంది ఓ వార్త. ఇప్పటికే నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన కల్కి మూవీ సెన్సేషన్ క్రియేట్ చేసింది. దేశ వ్యాప్తంగా భారీ ఎత్తున డబ్బులు వసూలు చేసింది. ఇందులో తొలి పార్ట్ కల్కిలో స్టార్ హీరో ప్రభాస్ , బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనే కీ రోల్స్ పోషించారు. అంతే కాకుండా స్టార్ హీరో అమితాబ్ బచ్చన్ ముఖ్య పాత్ర పోషించారు. ఇదిలా ఉండగా ప్రస్తుతం హీరోయిన్ గా దీపికా ఉంటుందా లేదా అన్న అనుమానం నెలకొంది. ఈ తరుణంలో తనకు బదులు ప్రియాంకను తీసుకుంటున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా దీపికా పదుకొనే ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నట్లు వచ్చిన వార్తల తర్వాత. ఆమె నిష్క్రమణ ఊహాగానాలకు తెరతీసింది, ప్రియాంక చోప్రా ఈ పాత్రను పోషించడానికి బలమైన పోటీదారుగా ఉద్భవించింది.
ప్రపంచ వ్యాప్తంగా ప్రియాంక చోప్రా అంతర్జాతీయంగా ఉండటం ఆమె పరిశీలనలో ఉన్నట్లు టాక్. అనేక మంది అగ్ర నటీమణులు కూడా రేసులో ఉన్నారు. అలియా భట్ బృందంతో ముందస్తు చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. తను ఆర్ఆర్ఆర్ మూవీలో కీ రోల్ పోషించింది. ఈ ఇద్దరి నటీమణులతో పాటు మరికొందరు హీరోయిన్లను కూడా పరిగణలోకి తీసుకుంటున్నట్లు టాక్. వీరిలో నేచురల్ స్టార్ హీరోయిన్ సాయి పల్లవితో పాటు అనుష్క శర్మను కూడా ఈ కీలక రోల్ కు సరిపోతారా లేదా అని ఆలోచిస్తున్నట్లు టాక్. మరి నాగ్ అశ్విన్ సీక్వెల్ కల్కి-2 మూవీలో నలుగురు హీరోయిన్లలో ఎవరిని ఎంపిక చేస్తారనేది ఉత్కంఠ నెలకొంది.



















