న్యూఢిల్లీ : కేంద్ర సర్కార్ మైనార్టీ వర్గాల సంక్షేమం కోసం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. తనను కలిసిన మైనార్టీ పెద్దలతో సంభాషించారు. ఈ సందర్బంగా కీలకమైన హామీ ఇచ్చారు. మైనారిటీ సంక్షేమం, ముఖ్యమైన అంతర్జాతీయ పరిణామాలకు సంబంధించిన సమస్యలతో పాటు వివిధ సామాజిక, మానవతా, విద్యా, అభివృద్ధి విషయాలపై ఫుల్ క్లారిటీ ఇచ్చారు. ఇటీవలి కేరళ పర్యటన సందర్భంగా సమాజంలోని వివిధ వర్గాల నుండి సేకరించిన ఆందోళనలు , అభ్యర్థనలను కూడా ప్రధానమంత్రి దృష్టికి తీసుకు వచ్చారు మైనార్టీ పెద్ద. పవిత్ర రంజాన్ మాసం కోసం నా సందేశాన్ని కూడా అందించే అవకాశం లభించింది.
జమాయతుల్ ఉలమా, జామియా మర్కజ్ నాయకత్వంలో జరుగుతున్న విద్యా , సామాజిక సంక్షేమ కార్యక్రమాలను తాను నిశితంగా అనుసరిస్తున్నానని ప్రధానమంత్రి తెలిపారు. ఈ ప్రయత్నాలను ఆయన అభినందించారు. ప్రపంచ స్థాయిలో భారతదేశం ఖ్యాతిని పెంచడానికి దోహదపడే ఇటువంటి కార్యక్రమాలు నిజంగా ప్రశంసనీయమని పేర్కొన్నారు. సమాజంలోని అన్ని వర్గాలను ఆకట్టుకునే సమగ్ర అభివృద్ధి అవసరం అని అభిప్రాయపడ్డారు నరేంద్ర మోదీ. చారిత్రక మసీదులు , ఇస్లామిక్ వారసత్వ కట్టడాల రక్షణ, మౌలానా ఆజాద్ నేషనల్ ఫెలోషిప్ సహా మైనారిటీ విద్యా సంక్షేమ పథకాలను పునరుద్ధరించడం, బరేలీ సంఘటనతో సహా అమాయక ప్రజలకు న్యాయం జరిగేలా చూడటం గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు ప్రధానితో.
