10న ప్ర‌ధాన‌మంత్రి మోదీ రాక : ఈట‌ల రాజేంద‌ర్

భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నామన్న ఎంపీ

Hellotelugu-EatalaRajender

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : బీజేపీ ఎంపీ ఈట‌ల రాజేంంద‌ర్ కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. ఈనెల 10వ తేదీన తెలంగాణ రాష్ట్రానికి ప్ర‌ధానమంత్రి న‌రేంద్ర మోదీ రానున్నార‌ని తెలిపారు. ఈ సంద‌ర్బంగా బీజేపీ నేత‌లు, కార్య‌క‌ర్త‌లు పెద్ద ఎత్తున పాల్గొనాల‌ని పిలుపునిచ్చారు. పీఎం ప‌ర్య‌ట‌న‌ను విజ‌య‌వంతం చేయాల‌ని కోరారు ఈట‌ల రాజేంద‌ర్. ఇందులో భాగంగా పరేడ్ గ్రౌండ్స్ లో జరగబోయే భారత ప్రధాని మోదీ బ‌హిరంగ స‌భ ఉంటుంద‌న్నారు. ఇప్ప‌టికే స‌భ‌ను ఖ‌రారు చేశామ‌ని, భారీ ఎత్తున జ‌నం రానున్న‌ట్లు తెలిపారు.

ఇదిలా ఉండ‌గా మోదీ స‌భ‌కు జనాగ్రహ సభ అని పేరు కూడా పెట్ట‌డం జ‌రిగింద‌న్నారు. ఈ నేపథ్యంలో ఈరోజు తూంకుంటలో ఏర్పాటు చేసిన సన్నాహక సమావేశంలో పాల్గొని నాయకులకు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు ఎంపీ ఈట‌ల రాజేంద‌ర్. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు బుద్ధి శ్రీనివాస్ , మాజీ అధ్యక్షులు పీ. విక్రమ్ రెడ్డి , మాజీ ఎంపీపీ, సీనియర్ నాయకుల వై. సుదర్శన్ రెడ్డి , జిల్లా ప్రధాన కార్యదర్శి అమరం మోహన్ , రంగారెడ్డి ఉమ్మడి జిల్లా మాజీ అధ్యక్షులు అంజన్ కుమార్ గౌడ్ , మాజీ అసెంబ్లీ కన్వీనర్ లక్ష్మారెడ్డి , తూంకుంట అధ్యక్షులు నరసింహ రెడ్డి , మాజీ సర్పంచ్ లు సుదర్శన్ , శ్రీనివాస్ గారు ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Exit mobile version